Telugu News

బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్ : మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి

పొంగులేటి క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుక

0

బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్ : మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి

– పొంగులేటి క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుక

(ఖమ్మం  -విజయం న్యూస్):-
బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో గురువారం అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు.

also read:-ఆండ్రిపాల్ అడవుల్లో ఎదురుకాల్పులు

దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు పేదల దరిచేరుతున్నాయంటే దానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగమే ముఖ్య కారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కార్పొరేటర్ దొడ్డా నగేష్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు కోసూరి శ్రీనివాసరావు, బోర్ల లక్ష్మినారాయణ, కానుగుల రాధాకృష్ణ, దుంపల రవికుమార్, మొగిలిచర్ల సైదులు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

also read :-మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య

నూతన వధూవరులకు మాజీ ఎంపీ పొంగులేటి ఆశీర్వాదం
ఖమ్మం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని వాసవీ గార్డెన్స్ లో బూర్ల పుల్లారావు కుమార్తె వివాహానికి, శ్రీరామ్ లీలా కల్యాణ మండలంలో జల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి, సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్ సోదరుని కుమార్తె వివాహానికి, గొరిల్లా పార్క్ కన్వెన్షన్ హాల్లో కర్నాటి గ్రీష్మ, శ్రీషర్ల వివాహ నిశితార్థ వేడుకకు, మొగిలి పాపిరెడ్డి పంక్షన్ హాల్లో పేరం సత్యనారాయణ సోదరుని కుమార్తె వివాహానికి, భూక్యా లలిత కుమార్తె వివాహానికి హాజరైయ్యారు.

వధూవరులను ఆశీర్వాదించి నూతన వస్త్రాలను బహుకరించారు. అదేవిధంగా రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పోరేటర్లు మలీదు జగన్, దొడ్డా నగేష్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, భీమనాధుల అశోక్ రెడ్డి, దుంపల రవికుమార్, కోపిల తంబి, నర్సింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే తాటి కుమార్తె మృతి పట్ల పొంగులేటి దిగ్బ్రాంతి
బూర్గంపాడు: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి మృతి పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెల్లం వెంకట్రావు, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ గోసు మధు, మాజీ జడ పీటీసీ అంజి తదితరులు పాల్గొన్నారు.