బహుత్ అచ్చా ==అకట్టుకుంటున్నరఘునాథపాలెం బృహత్ పల్లెప్రకృతి వనం
రఘునాథపాలెం/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్
బహుత్ అచ్చా ==
అకట్టుకుంటున్నరఘునాథపాలెం బృహత్ పల్లెప్రకృతి వనం
(రఘునాథపాలెం/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-
అందమైన బొమ్మలు..అద్భుతమైన అకృతి.. అహ్లాదాన్ని పంచే ప్రకృతి.. ప్రజలకు ఇంతకంటే ఇంకేం కావాలి..పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారించిన ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనం కుశ్రీకారం చుట్టగా, ఆ వనాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు ప్రజాప్రతినిధులు. ప్రతిగ్రామ పంచాయతీలో ఈ వనాలను ఏర్పాటు చేస్తుండగా, మండల కేంద్రాల్లో మాత్రం బృహత్పల్లె ప్రకృతి వనాలను అద్భుతంగా తయారు చేస్తున్నారు..
also read;-మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి పువ్వాడ.
ప్రజలు అకట్టుకునే విధంగాఅద్భుత రితీలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సేద తీరేందుకు కావాల్సిన అహ్లాదకర వాతావరణాన్నఅక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి మానవాళికి అవసరం అనే ఉధ్దేశ్యంతో ఈ ప్రకృతి వనంను తయారు చేస్తున్నారు.ఖమ్మం అభివద్దిపైదృష్టిపెట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని రఘునాథపాలెం మండలాన్నికూడా అదే విధంగా అభివృద్దిపై దష్టిసారిస్తున్నారు.. అనేక అనేక మార్పులతో ఖమ్మంనగరాన్న వావ్ అనిపించే విధంగా అభివృద్ది చేసిన మంత్రి పువ్వాడ అజయ్, రఘునాథపాలెంమండలాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్దిపై దష్టి సారించారు.
అందులో భాగంగానే అనేకపథకాలకు శ్రీకారం చుట్టారు. కాగారఘునాథపాలెం మండలంలో నూతనంగా నిర్మాణం చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం పలువుర్నిఅకట్టుకుంటోంది. ప్రజలు అకట్టుకునే విధంగా అక్కడ బొమ్మలను ఏర్పాటు చేశారు. చూస్తుంటేనే ముచ్చటగొలిపే విధంగా ఆ వనంను తయారు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలందరు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అభినందిస్తున్నారు.