Telugu News

నేటి నుంచి భట్టి పాదయాత్ర

== బోనకల్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం

0

నేటి నుంచి భట్టి పాదయాత్ర

== బోనకల్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం

== సాయిబాబా గుడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్న భట్టి విక్రమార్క

== ఈ నెల 11 నుంచి 14 వరకు బోనకల్ మండలంలో, 15 నుంచి మధిర మండలంలో పాదయాత్ర

== పాదయాత్రకు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన బోనకల్ మండల పార్టీ నాయకులు

(బోనకల్/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కొరకై చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతున్నది. బోనకల్లు మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి సీఎల్పీ నేత పాదయాత్రను సోమవారం మొదలు పెట్టనున్నారు. ఫిబ్రవరి 27న ముదిగొండ మండలం యడవల్లి నుంచి మొదలైన పాదయాత్ర మార్చి 5వరకు కొనసాగింది.

also read :-ఢిల్లీలో తెలంగాణ భవన్ నందు రైతు దీక్ష ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నామ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండటంతో మార్చి 6 నుంచి 24 వరకు పాదయాత్రను వాయిద వేయగా, తిరిగి మార్చి 25న ముదిగొండ మండలం అమ్మపేట టెంపుల్ నుంచి తిరిగి ప్రారంభమైంది. అనంతరం ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్య నాయకులతో ఈ నెల 4న సమావేశం నిర్వహించిన నేపథ్యంలో సమావేశానికి వెళ్ళడానికి భట్టి విక్రమార్క ఈ నెల 2న బోనకల్ మండల కేంద్రానికి చేరుకున్న పాదయాత్రకు చిన్న విరామం ఇచ్చిఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం తో సమావేశం ముగియడంతో ఈ నెల 11 నుంచి పాదయాత్రను బోనకల్ సాయిబాబా గుడి నుంచి యధావిధిగా కొనసాగిస్తున్నారు. 16 రోజులలో ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలంలోని అరవై గ్రామాలను పాదయాత్ర చుట్టేసింది.

also read :-గిరిజనులకు జరుగుతున్న అవమానాలను ఖండిస్తున్నాం

దాదాపుగా 250 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించిన సీఎల్పీ నేత విక్రమార్క ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల గొంతుకగా అసెంబ్లీలో గళం వినిపించారు. అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లిన పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మూడు లక్షలు మంజూరు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి తీసుకోవడం, మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానన్న ప్రకటన, కల్లుగీత కార్మికులకు మోపెడు వాహనాలు పంపిణీ చేస్తామని, గీత సొసైటీలకు తాటి ఈత వనాల పెంపకంలో కోసం స్థలం కేటాయింపు పై ప్రభుత్వం ప్రకటన చేసే విధంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దోహదపడింది. కాగా పాదయాత్ర 17వ రోజులో భాగంగా సోమవారం బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి బోనకల్ రైల్వే బ్రిడ్జి మీదుగా రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో (సుమారుగా 12 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగుతుంది. అదే రోజు రాత్రి రామాపురంలోని నల్లమోతు సత్యనారాయణ ఇంట్లో బస చేస్తారు.
== బోనకల్లు లో పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు
బోనకల్ మండలం లో ఈ నెల 11 నుంచి 14 వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు అమ్మ ఫౌండేషన్ అధ్యక్షురాలు భట్టి విక్రమార్క సతీమణి నందిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పైడి కిషోర్, మండల అధ్యక్షులు, పైలెట్ టీం సభ్యులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశారు.

also read :-అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం…….

ఆయా గ్రామాల్లో పాదయాత్రను విజయవంతం చేయడం కోసం ముందస్తు సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు తెలిసేలా ప్రచార రథం ఏర్పాటు చేసి మైక్ ప్రచారం చేస్తున్నారు. పాదయాత్ర ముందు రోజు ఆయా గ్రామాల్లో డప్పు చాటింపు (దండోరా) వేయిస్తున్నారు. స్వాగత బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్ ద్వారా పాదయాత్ర ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మండల నాయకత్వం పాదయాత్ర జరిగే గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించారు. ఆ సమస్యలను పాదయాత్ర సందర్భంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ఇదే క్రమంలో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ తో పాటు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సైతం ప్లాన్ చేశారు.

** బోనకల్లు మండలంలో పాదయాత్ర షెడ్యూల్
== సోమవారం బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి బోనకల్ రైల్వే బ్రిడ్జి మీదుగా రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో (సుమారుగా 12 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగుతుంది. అదే రోజు రాత్రి రామాపురంలోని నల్లమోతు సత్యనారాయణ ఇంట్లో బస చేస్తారు.

== ఈ నెల 12న మంగళవారం రోజున గార్లపాడు నుంచి లక్ష్మీపురం, గోవిందాపురం, పెద్ద బీరవల్లి, జానకిపురం
గ్రామాల్లో (సుమారుగా 15 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగుతుంది. అదే రోజు రాత్రి జానకిపురం లో ఫంక్షన్ హాల్ లో బస చేస్తారు.

== ఈనెల 13న బుధవారం రోజున జానకిపురం నుంచి నారాయణపురం, చిన్న బీరవల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో (సుమారుగా 12 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగుతుంది. అదే రోజు రాత్రి కలకోట గ్రామం లో పైడి కిషోర్ ఇంట్లో బస చేస్తారు.
== ఈనెల 14న గురువారం రోజున కలకోట నుండి రాయనపేట, ఆల్లపాడు, గోవిందపురం, మోటమర్రి
గ్రామాల్లో (సుమారుగా 17 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగుతుంది. అదే రోజు రాత్రి మోటమర్రి గ్రామంలోని వాటర్ ట్యాంక్ ప్రదేశం వద్ద బస చేస్తారు.