Telugu News

సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు టిడిపి నేతల సంఘీభావం

0

సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు టిడిపి నేతల సంఘీభావం

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)కు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు,
రాష్ట్ర ఉపాధ్యక్షులు లు వాసిరెడ్డి రామనాధం, జిల్లా కార్యదర్శులు గుప్త సీతయ్య, కేతినేని హరీష్, సాన బోయిన శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం నగర అధ్యక్షులు వడ్డేం విజయ్ లు సంఘీభావం ప్రకటించారు.

also read;-ఖమ్మం నగర కి మహర్దశ: ఖమ్మం నగర మేయర్

శనివారం చింతకాని మండలం నరసింహపురంలోసీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని కలిసి తమ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని టిడిపి కార్యకర్తలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.