Telugu News

ఖమ్మం లో ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు

పార్టీ జెండాను అవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు గల్లా

0

ఖమ్మం లో ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు

== పార్టీ జెండాను అవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు గల్లా

(ఖమ్మం-విజయంన్యూస్);-
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఖమ్మం జిల్లా కార్యాలయంలో జెండా ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ దేశ ప్రధాని కాగలి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమైందని అన్నారు.

also read;-ఖమ్మం తెరాస నిరసన దీక్షకు ఛాంబర్ ఆప్ కామర్స్ సంపూర్ణ మద్దతు

భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని దానికి ప్రత్యేక ఉదాహరణ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ అని అన్నారు. చిట్టచివర వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అన్నదే బిజెపి లక్ష్యమని అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద జాతీయ పార్టీగా అవతరించింది అని, అనేక రాష్ట్రాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి పాలన అందిస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కడగంచి రమేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు ప్రతి కార్యకర్త ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయాలని కోరారు.

also read;-*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సహా ఇంచార్జ్ విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు గంటేల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రుద్ర ప్రదీప్, నున్న రవి కుమార్, శ్యామ్ రాథోడ్, కొండా హరీష్,ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ కనమర్లపూడి ఉపేంద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి, బోయినపల్లి చంద్రశేఖర్,బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వట్టికొండ శ్రీనివాసరావు, డాక్టర్ శీలం పాపారావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డ అరుణ, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కొలిపాక శ్రీదేవి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాషా, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కోటమర్తి సుదర్శన్, గిరిజన నాయకులు విక్రమ్ జాదవ్, రీగన్ ప్రతాప్, అనిత, పిల్లలమర్రి వెంకట్, కుమిలి శ్రీనివాస్, కొనతం లక్ష్మీ నారాయణ గుప్తా, డికొండ శ్యామ్, శాసనాల సాయిరాం, అంకతి పాపారావు, నాగమణి, సుగుణ, సాయి, గోనెల శివ, పృద్వి నాయక్, అజయ్, గడిల నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..