నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం పట్ల కరీంనగర్ లో బీజేపీ శ్రేణుల సంబరాలు
**టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం పట్ల కరీంనగర్ లో బీజేపీ శ్రేణుల సంబరాలు
* **టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు ..
***కేంద్రంలో… రాష్ట్రంలో బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ లు !
***తెలంగాణలో రాబోయేది డబల్ ఇంజన్ సర్కారే….
***బిజెపి పట్ల విశ్వసనీయతకు ఎన్నికల ఫలితాలు నిదర్శనం
***బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి
(విజయం న్యూస్):-
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సంబరాలు జరిపింది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశానికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బిజెపి ప్రధాని మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజానీకం బలంగా కోరుకుంటున్నారని చెప్పారు . కేంద్రంలో రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలనే ఆకాంక్ష దేశ ప్రజల్లో ఉందని , ఆ దిశగానే నాలుగు రాష్ట్రాలలోబీజేపీ పై విశ్వాసం ఉంచి ఆదరించి ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఘన విజయాన్ని అందించారని తెలిపారు .
also read :-శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని అందించిన ఆయా రాష్ట్రాల ప్రజానీకానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో బిజెపి చరిత్ర తిరగరాసిందని, చరిత్రలో నిలిచే విధంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం అభినందనీయమన్నారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ పాలన, యోగి మార్క్ సుపరిపాలన తోనే ప్రజలందరూ ఉత్తరప్రదేశ్లో రెండోసారి బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువు గా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు , దేశం కోసం , ప్రజల కోసం ఆలోచిస్తున్న విధానాలతో దేశవ్యాప్తంగా బీజేపీ ని ఆదరిస్తున్నారని తెలిపారు .సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ , సబ్ కా ప్రయాస్ నినాదంతో బి.జె.పి ముందుకు వెళుతుందని, బిజెపి ప్రభుత్వం చేసే విధానాలకు దేశ ప్రజలందరికీ సంపూర్ణ మద్దతు ఉందని , అందుకే బిజెపి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.
also read :-మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఎలా స్కెచ్ వేశారంటే.
బీజేపీ పై ఉన్న విశ్వాసానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో డబల్ ఇంజన్ సర్కారులు అధికారంలో ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా లో బీజేపీ కి స్పష్టమైన తీర్పు ఇచ్చారని, కి ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం లాంటివని, అలాగే 2023 ఎన్నికలకు కూడా ఫలితాలు రిఫరెండం లాంటివేననన్నారు. ఫెడరల్ ఫ్రంట్ , టెంటు అని , బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రచారం చేస్తూ , బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కూటమి కడదామనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ ఫలితాలు చెంప పెట్టు లాంటివేనన్నారు. ప్రపంచంలోనే బిజెపికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి, బలమైన శక్తిగా ఉన్న బిజెపి నీ ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దించుతామనుకోవడం అవివేకమన్నారు.
దేశవ్యాప్త ప్రజలఆదరాభిమానాలతోె దేశంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి శక్తి సామర్థ్యాలు కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. బిజెపి ని ఎదుర్కోవడం కేసీఆర్ తరం కాదని , తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైందనే విషయం కెసిఆర్ గ్రహించుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కారే ఏర్పాటు కాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
also read :-మహిళా బంధువుడు సీఎం కేసీఆర్
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరటాల శివ రామ కృష్ణయ్య, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ మేయర్ డి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవరెడ్డి, , జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, గుర్రాల వెంకటరెడ్డి , కన్న కృష్ణ ,మాడ వెంకటరెడ్డి ,జిల్లా కార్యదర్శులు రాపర్తి ప్రసాద్ బింగి కరుణాకర్, , భాస సత్యనారాయణ, కొట్టే మురళి కృష్ణ, మాడుగుల ప్రవీణ్, కటకం లోకేష్, బొంతల కళ్యాణ్ , సంకిడి శ్రీనివాస్ రెడ్డి, ముత్యం రావు, జానపట్ల స్వామి,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్ , బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు గాయత్రి,బల్బీర్ సింగ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, బండ రమణారెడ్డి పుప్పల రఘు, జాడి బాల్రెడ్డి ,కార్పొరేటర్లు కచ్చు రవి, కాసర్ల ఆనంద్, పెద్దపెల్లి జితేందర్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, నాంపల్లి శ్రీనివాస్, కూర మైపాల్ రెడ్డి, జంగా జైపాల్, తూముల శ్రీనివాస్, సత్యనారాయణ , మండల అధ్యక్షులు, బిజెపి నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు