బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
—దేశంలో బలమైన పార్టీ బిజెపి ..
—పార్టీ పతాక ఆవిష్కరణ లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణ రెడ్డి
(కరీంనగర్ విజయం న్యూస్):-
భారతీయ జనతా పార్టీ పార్టీ స్థాపించి నేటితో 42 సంవత్సరాలు అవుతుందని, ఇన్నేళ్ల పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నేడు దేశంలోని బలమైన పార్టీగా అవతరించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.భారతీయ జనతా పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు . వేడుకల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు . అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని జిల్లా పార్టీ శ్రేణులు వీక్షించే విధంగా కరీంనగర్లోని శుభ మంగళ గార్డెన్ లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు.
also read;-ఘనంగా భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం
తదనంతరం బీజేపీ శ్రేణులు కమాన్ నుండి బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీగా ఉందని , దేశవ్యాప్తంగా ప్రజాదరణతో దేశంతో పాటు అనేక రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగించి, దేశంలోనే బలమైన పార్టీగా ఆవిర్భవించిందని తెలిపారు.
2 ఎంపీ సీట్ల నుండి ఇప్పుడు 303 వరకు బిజెపి ప్రస్థానం చేరుకొని అతి పెద్ద పార్టీగా అవతరించిన ఘనత బిజెపి కే దక్కుతుందని, రెండు ఎంపీ సీట్లు వచ్చాయి కదా అని ఇక్కడ పార్టీ తన సిద్ధాంతాలను, విలువలను వదులుకోకుండా అదే ధైర్యం అదే పట్టుదల కొనసాగించి నేడు దేశంలోని బలమైన పార్టీగా అవతరించిందన్నారు .
also read :-ఖమ్మం లో ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు
నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం పార్టీలోనే ఎందరో మహానుభావుల కృషితోనే భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ విధానంతోనే పార్టీ శ్రేణులు ముందుకు కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయడం శ్రమించడం బి జె పీ లోనే ఉంటుందన్నారు. సబ్ క సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ సూత్రంతోనే భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ప్రజా అభిమానం చూరగొందని పేర్కొన్నారు. దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో , బిజెపి రాష్ట్ర రథసారథి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సారథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికీ బీజేపీ ప్రధాన మోడీ నాయకత్వమే శ్రీరామరక్షగా భావిస్తున్నారని, అందుకే భారతదేశంలో బిజెపి తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు
also read :-.ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జన్మదిన వేడుకలు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కొరటాల శివ రామ కృష్ణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, గుర్రాల వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, బాస సత్యనారాయణ, కోమల ఆంజనేయులు, మాడుగుల ప్రవీణ్, కటకం లోకేష్, బొంతల కళ్యాణ్, జానపట్ల స్వామి మర్రి సతీష్, చొప్పరి జయశ్రీ, బండారి గాయత్రి, కచ్చు రవి, పెద్దపెల్లి జితేందర్ ,కాసర్ల ఆనందం, అనూప్,బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, ఆవుదుర్తి శ్రీనివాస్, పాదం శివరాజ్, ప్రవీణ్ రాజ్ ,కుమార్, శివానంద, యువ క్రాంతి తదితరులు పాల్గొన్నారు