Telugu News

బిజెపి  కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ ను బర్తరఫ్ చేయాలి

తిరుమలాయపాలెం-విజయం న్యూస్

0

బిజెపి  కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్  ను బర్తరఫ్ చేయాలి

( తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

పార్లమెంటులో గిరిజన శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు గిరిజన బిల్లు పంపలేదని అబద్దపు మాటలు మాట్లాడిన వైఖరికి నిరసనగా  పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలయ్యపాలెం టిఆర్ఎస్ పార్టీ గిరిజన మండల కమిటీ అధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి,మోదీ దిష్టి బొమ్మ దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున  నినాదాలు చేశారు. ఈ సంధర్భంగా పలువురు నాయకులు మాట్లడుతూ..

also read;-కాబోయే మహిళా మంత్రివర్యలు ఎవరు 

గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారని, రాజ్యాంగాన్ని అవమానపర్చారని ద్వజమెత్తారు. కేంద్రం ప్రభుత్వ విధానాలు, వారు మాటలు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయన్నారు.

తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల  రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగిందన్న విషయం మీకు తెలియకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ బోడ మంచి నాయక్ తిరుమలాయపాలెం న్ టి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆర్మీ రవి మండల కమిటీ సభ్యులు కృష్ణ పైనంపల్లి ఉప సర్పంచ్ ధరావత్ శ్రీను నాయక్ చంద్రు తండా టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బోడ రఘు ఇస్లావత్ తండ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చక్రం వార్డ్ మెంబర్ రవి ప్రసాద్ మమతా మాజీ సర్పంచ్ కూడా మారారు గిరిజన నాయకులు గిరిజన మహిళలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్నారు