కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం ఎంపీ నామ ఇంటిపై నల్లజెండా ఎగురవేత
ప్రతి గింజనూ కేంద్రం సేకరించాల్సిందే
కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం ఎంపీ నామ ఇంటిపై నల్లజెండా ఎగురవేత
—-ప్రతి గింజనూ కేంద్రం సేకరించాల్సిందే
—-కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించొద్దు
—-టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు పిలుపు
(న్యూఢిల్లీః విజయం న్యూస్):-
తెలంగాణ రైతాంగం ఆరుగాలం కష్టించి పండించే ధాన్యంపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యానికి టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఖమ్మంలో నెహ్రూనగర్‌లో గల తన ఇల్లు వరలక్ష్మీ నిలయంపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ జెండాను ఎగురవేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం తప్పకుండా కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.
also read :-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..
దేశవ్యాప్తంగా అన్నదాతలు చేసిన ఉద్యమంతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే తెలంగాణలోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తెలంగాణ రైతులు అదే మాదిరి కేంద్రంపై ఉద్యమిస్తారని ఎంపీ నామ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్ సీఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోవడం దారుణం అన్నారు.
also read :-ఆంగ్ల మాధ్యమాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేద్దాం*.
ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం, కులం, మతంతో సంబంధం లేకుండా, ఎక్కడ ఉన్నా రైతు రైతేనన్న ఆయన, కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నేపథ్యం భిన్నమైనదన్నారు ఆయన చెప్పారు. ఒకప్పుడు నీటి కొరత ఉన్న తెలంగాణలో, గత 8 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ విధానాలతో అద్భుతమైన సాగునీటి వసతులు ఏర్పాటు చేయడంతో పాటు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రైతుల నుండి నీటి పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
రైతు బంధు పథకంతో ఎకరానికి ప్రతి ఏడాది రూ. పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో తెలంగాణలో వరి ధాన్యం దిగుబడి రెట్టింపు అయిందని, దీంతో ధాన్యం వినియోగం అనంతరం అనేక మిగులు ధాన్యం తెలంగాణలో ఉంటోందని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీంతో ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరామని, ధాన్యం కొనుగోలుపై గతంలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
also read :-తెలంగాణ వరి ధాన్యం సేకరణలో ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్రంపై టీఆర్ఎస్ యుద్ధం
వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ లో కొంటున్న విధంగానే తెలంగాణ లోనూ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆయన, బాయిల్డ్ రైస్, ముడి బియ్యం అంటూ కండిషన్ లు పెట్టకూడదన్నారు. తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలుకై జాతీయ రహదారులపై చేస్తున్న నిరసనలతో ఇబ్బంది పడ్డ ఇతర రాష్ట్రాల ప్రజలు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లాలని నామ సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఢిల్లీ వీదుల్లో ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకురావద్దని బీజేపీ ప్రభుత్వానికి సూచన చేశారు. వాస్తవానికి 20 రోజుల పాటు ఢిల్లీలోని పార్లమెంట్ వేదికగా ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఎంపీ నామ మండిపడ్డారు