ఇంటికి నల్ల జెండాను కట్టి నిరసన వ్యక్తం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
(ఖమ్మం-విజయంన్యూస్)
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖమ్మంలోని వారి నివాసంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి ఇంటికి నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేశారు.
also read :-శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ దేశంలో అధికారం కోసం అబద్దాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బిజెపి పార్టీ అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. దేశంలో రైతాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నట్టేట ముంచిందని దయ్య పట్టారు, ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపేట ఎంపీటీసీ మోదుగు వీరభద్రం తదితర నాయకులు హాజరైయ్యారు.