Telugu News

భారత్ లో పర్యటిస్తున్నబోరిస్‌

== అహ్మదాబాద్‌లో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికిన నేతలు

0

భారత్ లో పర్యటిస్తున్నబోరిస్‌

== అహ్మదాబాద్‌లో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికిన నేతలు

== సబర్మతి ఆశ్రమ సందర్శన..గాంధీకి నివాళి

== సబర్మతి సందర్శన అదృష్టంగా పేర్కొన్న బ్రిటన్‌ ప్రధాని

(గాంధీనగర్‌-విజయంన్యూస్):

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్ చేరుకున్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన గురువారం అహ్మదాబాద్‌ చేరుకున్నారు.. ఆయనకు స్థానిక అధికారులు, ముఖ్యనేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ రచించిన గైడ్‌ టు లండన్‌ అనే పుస్తకాన్ని ఆశ్రమ నిర్వాహకులు బోరిస్‌ జాన్సన్‌కు అందదేశారు. అలాగే గాంధీ శిష్యురాలు విూరాబెన్‌ ఆత్మకథ ’ద స్పిరిట్స్‌ పిల్‌గ్రిమేజ్‌’ పుస్తకాన్ని కూడా అందజేశారు. అసాధారణమైన వ్యక్తి ఆశ్రమానికి రావటం, ప్రపంచాన్ని మార్చడానికి సత్యం, అహింసలను ఎలా మూలసూత్రాలుగా మలుచుకున్నారో అర్థం చేసుకోవడం.. తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

also read :-తొర్రూరు డిఎస్పీ వెంకటరమణ కుమార్తె హర్ష అనారోగ్యంతో మరణించగా.

బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల భారత పర్యటన గురువారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభమైంది. ఈ అసాధారణ వ్యక్తి ఆశ్రమాన్ని సందర్శించడం తనకు దక్కిన అపురూపమైన గౌరవమని సందర్శకుల పుస్తకంలో ఆయన రాశారు. మేలుకోసం ప్రపంచాన్ని మార్చడానికి సత్యం, అహింస అనే సున్నితమైన సిద్దాంతాలను ఏ విధంగా మోహరించారో తెలుసుకోవడం తనకు లభించిన విశిష్ట అవకాశమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సబర్మతి ఆశ్రమంలో బోరిస్‌ జాన్సన్‌ చరఖాను తిప్పి, నూలు వడికారు. ఈ ఆశ్రమం విశేషాలను గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ శిష్యురాలు విూరాబెన్‌ (మెడలీన్‌ స్లేడ్‌) రాసిన ’ది స్పిరిట్స్‌ పిల్‌గ్రిమేజ్‌’ పుస్తకాన్ని జాన్సన్‌కు బహూకరించారు. మహాత్మా గాంధీ రాసిన, ప్రచురింపబడని పుస్తకం ’గైడ్‌ టు లండన్‌’ను కూడా ఆయనకు బహూకరించారు.

అంతకుముందు బోరిస్‌ జాన్సన్‌కు అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్‌ వరకు నాలుగు కిలోవిూటర్ల పొడవునా రోడ్‌ షో, గుజరాతీ నృత్యాలతో స్వాగతం పలికారు. బోరిస్‌ జాన్సన్‌ పర్యటన కోవిడ్‌ మహమ్మారి కారణంగా గతంలో రద్దయింది. ప్రస్తుత భారత పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన చర్చలు జరుపుతారు. మన దేశంలో బ్యాంకులను మోసగించి, లండన్‌లో ఉంటున్న విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను భారత దేశానికి అప్పగించాలని ప్రధాని మోదీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీరవ్‌ మోదీ సౌత్‌`వెస్ట్‌ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు. విజయ్‌ మాల్యా లండన్‌లో ఉన్నారు. బోరిస్‌ జాన్సన్‌ గురువారం గుజరాత్‌లో గడుపుతారు.

also read;-ఏపీలో గ్రామ, వార్డు సచివాలయల ఉద్యోగులకు శుభవార్త..!!

సైన్స్‌, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం, పెట్టుబడులను ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బ్రిటిష్‌ ప్రధాన మంత్రి గుజరాత్‌లో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. మరోవైపు బ్రిటిష్‌`ఇండియన్‌ జనాభాలో దాదాపు సగం మంది గుజరాతీ మూలాలుగలవారే. ఈ పర్యటన వల్ల బ్రిటన్‌ ఎన్నికల్లో ఆయన పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కూడా కొందరు చెప్తున్నారు. భారత పర్యటనకు బయల్దేరడానికి ముందు బోరిస్‌ జాన్సన్‌ పంపిన సంకేతాల ప్రకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి బదులుగా మరిన్ని వీసాలను భారతీయులకు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతిభావంతులు బ్రిటన్‌కు రావడానికి తాను ఎల్లప్పుడూ అనుకూలమేనని ఆయన చెప్పారు. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలో వందలు వేల మంది ప్రతిభావంతుల కొరత ఉందన్నారు. మనకు ప్రగతిశీల వైఖరి అవసరమని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆయన కేవలం భారత దేశ వైఖరిని వింటారని, ఆయన ఉపన్యాసాన్ని ఇవ్వబోరని తెలుస్తోంది. ముఖ్యంగా నిర్బంధాలు లేని, స్వేచ్ఛాయుత ఇండో`పసిఫిక్‌, స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలపైనే దృష్టి పెడతారని సమాచారం. శుక్రవారం ఢల్లీిలో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, సైనిక, వాణిజ్య సంబంధాల గురించి ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఇండో`పసిఫిక్‌ రీజియన్‌పై కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. కాగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి