Telugu News

బడ్డీ కోట్లకు ప్రత్యామ్నాయం చూపకుండానే ఖాళీ చేయడంలో అర్థం ఏమిటి..?

0

బడ్డీ కోట్లకు ప్రత్యామ్నాయం చూపకుండానే ఖాళీ చేయడంలో అర్థం ఏమిటి..?
– అఖిలపక్షం

(మధిర విజయం న్యూస్);-

ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్డీ కోట్లు తీసివేయడం అనివార్యమైతే ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఖాళీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన మున్సిపాలిటీ పాలకవర్గం. దానికి భిన్నంగా బడ్డీ కోట్ల వాళ్ళను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ప్రచారం చేయడంతో చిరు వ్యాపారులు లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై సమావేశమైన అఖిలపక్షం చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా చిరు వ్యాపారులో కొందరిని ప్రలోభాలకు గురిచేసి, ఐక్యత ను భగ్నం చేసి ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయించే కుట్ర అధికార పార్టీ నాయకులు చేయటం దురదృష్టకరమన్నారు.

also read :-ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం ఉండాలి

వెంటనే బడ్డి కోట్లు తీసివేయాలని ప్రచారం ఆపివేసి వారికి ప్రత్యామ్నాయం చూపే పని చేయాలని అధికార పార్టీని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఇట్టి సమస్యపై చిరు వ్యాపారుల తో కలసి ఉద్యమం చేస్తామని. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపే వరకు ఖాళీ చేయనిబోమని అన్నారు ఈ పోరాటంలో ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు

also read :-మార్కెట్లో మంత్రి పువ్వాడ

ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షుడు షేక్ బాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు, అద్దంకి రవి కుమార్ మున్సిపల్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు సీపీఎం జిల్లా నాయకులు శీలం నరసింహారావు సిపిఎం మండల కార్యదర్శి మంద సైదులు సిపిఎం పట్టణ నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ, మురళి టిడిపి పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు సిపిఐ నాయకులు బెజవాడ రవి బాబు, చెరుకూరి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, మంగళగిరి రామదాసు కాంగ్రెస్ నాయకులు మాగం ప్రసాద్, జహంగీర్, శ్రీనివాసరావు, మొదలగు వారు పాల్గొన్నారు