క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం విజయం న్యూస్):-
ఆదివారం మమత హాస్పిటల్ మంత్రి పువ్వాడ అజయ్ స్వగృహం నందు అశ్వరావుపేట మండలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసాని చంద్రమోహన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించి వారిని అభినందించారు . అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇటీవలే జరిగిన కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన ఒక్క రూపాయికి దోస అనే కార్యక్రమం రాష్ట్రంలో వైరల్ అవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని ప్రత్యేకంగా యువజన సంఘం నాయకులను అభినందించారు .
also read ;-ముంబై గులాబీమయం.. సీఎం కేసీఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిమాని కాసాని చంద్రమోహన్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిమానంతో అజయ్ కుమార్ ఫోటోతో కూడిన జై పువ్వాడ అనే క్యాలెండర్ను అచ్చు వేయించమని పేర్కొన్నారు . వాటిని అశ్వరావుపేట మండలం అంతా పంపిణీ చేస్తామన్నారు . ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల నాయకులు , సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు , వైస్ ఎంపీపీ ఫణీంద్ర , కలపాల శ్రీనివాస్ , యువజన నాయకులు మోటురి మోహన్ తదితరులు పాల్గొన్నారు .