Telugu News

కేంద్రం కుటీల రాజ‌కీయాలు చేస్తోంది: నామా

== త‌క్ష‌ణ‌మే కుల గ‌ణ‌న చేయాల‌ని ఎంపీ నామ నాగేశ్వ‌రరావు డిమాండ్‌

0

కేంద్రం కుటీల రాజ‌కీయాలు చేస్తోంది: నామా

== త‌క్ష‌ణ‌మే కుల గ‌ణ‌న చేయాల‌ని ఎంపీ నామ నాగేశ్వ‌రరావు డిమాండ్‌

== స్పీక‌ర్ ఓంబిర్లాకు వాయిదా తీర్మానం అంద‌జేత‌

== రైతుల‌ సమస్యల పై గ‌త స‌మావేశాల్లో టీఆర్ఎస్ పోరాడిన‌ప్పుడు ప్ర‌తిప‌క్షాలు ఎక్కడికెళ్ళాయ్‌?

 

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)

దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ స‌భా ప‌క్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న లోక్‌స‌భ‌లో స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు అంద‌జేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశారు. కొన్ని దశాబ్దాలుగా దేశంలో కుల గణన జరగలేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, వచ్చే జనాభా లెక్క‌ల సంద‌ర్భంగా కులగణన చేయాలని పట్టుబ‌ట్టారు.

also read :-రైతు భీమా కోసం లంచం అడిగిన వైనం….

ఈ అంశంపై లోక్‌సభ చర్చించాలని ప్రత్యేక విన్నవించ‌గా, అందుకు స్పీక‌ర్ ఓంబిర్లా ఎంపీ నామ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిర‌స్క‌రించారు. చ‌ట్ట‌స‌భ స‌భ్యుల‌పై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించార‌ని, అటువంటి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పించుకుంటుద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్ త‌న వాయిదా తీర్మానం తిర‌స్క‌రించిన త‌ర్వాత ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో విలేకరులతో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర ప్రజా స‌మ‌స్య‌లు, వారికి సంబంధించిన అంశాలపై నిర్విరామంగా పార్లమెంట్ లో లేవనెత్తుతున్నామ‌ని వివ‌రించారు.

also read :-ఏప్రిల్ 4 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర

కులగ‌ణనపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చామని, దాని మీద చర్చ జరగాలని కోరితే… స్పీక‌ర్ త‌మ విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రించార‌ని మండిప‌డ్డారు. అందుచేత‌, లోక్‌స‌భ‌లో… రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారని తెలిపారు. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నా, కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో ఎంత చెప్పినా ప్రభుత్వం మొండికేస్తోందన్నని ధ్వ‌జ‌మెత్తారు. 92 ఏళ్ల క్రితం కులగణన జరిగిందని గుర్తు చేశారు.

అప్పటినుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కులగణనకు గురించి పట్టించుకోవడం లేద‌ని మండిప‌డ్డారు. ఈ విష‌యంపై ఎనిమిదేండ్ల కిందటే తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ఎంపీ నామ స్ప‌ష్టం చేశారు. 2014లో ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తీర్మానం పంపించినా స్పందనలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం… పేదలు, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అని ఎంపీ నామ‌ అభివ‌ర్ణించారు.

also read :-అంగరంగ వైభవంగా యాదాద్రి ఆలయం ప్రారంభం..

ఉభయసభల్లో తెలంగాణ ప్రజలు, రైతుల గురించే తాము మాట్లాడుతున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని అనేక అంశాలను సభల్లో లేవనెత్తుతున్నామని ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు స్పష్టం చేశారు. గత నవంబర్ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో తొమ్మిది రోజులు నిరంత‌రంగా రైతుల కోసం పార్లమెంట్ లో పోరాడామని ఎంపీ నామ నాగేశ్వ‌రరావు చెప్పారు. కొంతమంది ఎంపీలు తాము మాట్లాడలేదని చెబుతున్నారని, అయితే… తాము పోరాడిన విష‌యం అన్ని మీడియాల్లో వ‌చ్చింద‌ని గుర్తు చేశారు.

 

రాజకీయాల కోసమే మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయ‌ని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్న ప్రభుత్వాలు కూడా అసెంబ్లీ తీర్మానం చేయాలని బీజేపీనుద్దేశించి ఎంపీ నామ హితవు పలికారు. రైతులు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షాన టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ ఎంపీలు పోరాడ‌టం లేద‌ని ఎంపీ నామ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారా? రేపు ఆందోళన చేస్తాం రండి అంటూ ప్‌ఎతిప‌క్ష పార్టీల ఎంపీల‌కు నామ స‌వాల్ విసిరారు. అనంత‌రం గత పార్ల‌మెంట్ స‌మావేశాల్లో తొమ్మిది రోజులపాటు రాష్ట్ర రైతులకు మద్దతుగా ఆయ‌న లోక్‌స‌భ‌లో సుదీర్ఘఃగా ప్రసంగించిన వీడియో క్లిప్పింగులను ఎంపీ నామ మీడియాకు చూపించారు.