కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే
== ధరలు తగ్గించే వరకు పోరాటం తప్పదు
== విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-
పేదలను దోచుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఘాటుగ విమర్శించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…
also read :-ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటిపై దాడి విషయంలో 8మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
పేద ప్రజలను దోచుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిభక్త కవలలుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్ల నేడు సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ 2 ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులో ఉండేవని అన్నారు. యూపీఏ దిగిపోయే సమయంలో గ్యాస్ ధర 414 రూపాయలు మరియు డిజిల్, పెట్రోల్ 55, 71 రూపాయలుగా మాత్రమే ఉండేదని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా ప్రభుత్వమే భరించేదని అన్నారు. కానీ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.
also read ;-మాజీ శాసన సభ్యుడికి యావజ్జీవ కారాగార శిక్ష
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో పన్నుల రూపంలో 26లక్షల కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ 8 ఏండ్ల కాలంలో పేదలపై 36లక్షల కోట్ల రూపాయలు పన్నులు రూపంలో పేదలపై భారం మోపాయని అన్నారు.
ఎన్నికలకు ముందు అణా పైసా కూడా పెంచని ప్రభుత్వాలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత అమాంతం ధరలు పెంచుతున్నాయని అన్నారు. వాస్తవానికి పెట్రోల్ అన్ని ఖర్చులు కలుపు కోని లీటర్ 50 రూపాయలకే అందించవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం 35రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు వ్యాట్ రూపంలో ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు. అక్టోబర్ 4 2021న సవిల్ సప్లయ్ కమిషనర్ అనిల్కుమార్ ఎఫ్ సీఐకి లేఖ రాసారు. భవిష్యత్ లో పారబోయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం పెట్టారని ఈ సంతకంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల జుట్టు కేసీఆర్ అందించారని అన్నారు. నువ్వు లేఖ రాయకపోతే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా పరిధాన్యం కొనేలా వత్తిడి తెచ్చేవాళ్ళమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి రైతుల ఉపేరు పోసుకుంటున్న కేసీఆర్ను టీఆర్ఎస్ నేతలను అమరవీరుల స్థూపం దగ్గర రైతులతో రాళతొ కొట్టించాలి. పొరబోయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకం పెట్టినందుకు ప్రగతిభవన్ నుండిబయటికి వచ్చి ముక్కునేలకు దాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.
ALSO READ :-భారత విప్లవానికి సరైన మార్గం ప్రజాపంథా నే
వడ్లు కొనుగోలుపై మార్చి మొదటి వారంలోపే సిద్ధం చేసుకోవాల్సి ఉంది. కానీ ఏప్రిల్ వచ్చినా ఇంతవరకు ఓ అంచనా అంటూ లేదని అన్నారు. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం మొండి. బకాయి 15వేల కోట్ల బాకీ ఉంది. దివాలా తీసిన డిస్కంల భారం మళ్ళీ ప్రజలపైనే మోపుతున్నారని. అన్నారు. ప్రజల నుండి 15వేల కోట్ల రూపాయాలను రాబట్టాలని విద్యుత్ సంస్థలు చూస్తున్నాయని, కేసీఆర్ తెలంగాణ ప్రజలను నిలువునా దోచుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు ఫ్యాక్టరీలను మూసేశారని, పసుపు, మిర్చి తోటలకు తెగులు వచ్చిందని మరియు మొక్కజొన్న కొనే పరిస్థితి లేదని ప్రశ్నించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల పేద మరియు మధ్య తరగతి ప్రజల బతుకు అగమ్యగోచరంగా మారిందని అన్నారు.. దేశంలో 25 రాష్ట్రాల్లో వ్యాట్ చార్జీలు తగ్గించినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. రష్యా నుంచి అతి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ఉక్రేయిన్ సాకుతో ధరలు పెంచడం హేయమైన చర్య అని అన్నారు. గతంలో ఉన్న ధరల కంటే కూడా తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందించాల్సి ఉన్నా కేంద్రం. ప్రజలపై అధనపు భారం మోపుతోందని అన్నారు.
ALSO READ :-కోదండ రాముడి సన్నిధిలో భట్టి దంపతుల పూజలు
కేంద్రం పెట్రోల్, డిజిల్, మరియు గ్యాస్ ధరలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. యాసంగి పంట ముగుస్తున్న ధాన్యం కొనుగోళ్ళపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు: అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు రానున్న రోజుల్లో ఈ రెండు ప్రభుత్వాలకు మరణ శిక్ష తప్పదని జోష్యం చెప్పారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెబుతూ కాలం గడుబుతోందని అన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలతో సామాన్యులు నేడు ఫ్యాన్ మరియు కూలర్లు కూడా వినియోగించలేని పరిస్థితి దాపురించదని అన్నారు. కేంద్రం, రాష్ట్రం పేదలను అధిక ధరలతో దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరిట, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నాయని అన్నారు.
వీటన్నింటిపై భారత జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున నిరసనకార్యాచరణ చేపడుతున్నామని ఇందులో భాగంగా ఈ నెల 4న అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు, 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనలు, 7న విద్యుత్ సౌద, సివిల్ సప్లైయి కార్యాలయాల ముట్టడి చేస్తామని అన్నారు. ఈ పోరాటాలకు ప్రజలే నాయకత్వం వహించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతీ చంద్రం తదితరులు పాల్గొన్నారు.