Telugu News

కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షపూరిత వైఖరి : ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు

ఖానాపురం-విజయంన్యూస్

0

కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షపూరిత వైఖరి : ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
(ఖానాపురం-విజయంన్యూస్)
అన్ని రాష్ట్రాల్లో లాగానే తెలంగాణ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ పంటలను కొనుగోలు చేయాలని మండల పరిషత్ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. ఆదివారం ఖానాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభలో మండల పరిషత్ అధ్యక్షుడు వేములపల్లి ప్రకాష్ రావు రైతులకోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంపీటీసీలు,సర్పంచులు, రైతులు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

also read;-పొలిటికల్ అట్రాక్షన్ పొంగులేటి

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రైతులు పండించిన ధాన్యం ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మోదీ నాయకత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలువంచి ధాన్యం కొనుగోలు చేసే దాకా ఉద్యమిస్తామని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఓడిసిఎంఎస్ అధ్యక్షుడు గుగులోతు రామస్వామి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులను రాజుగా చేస్తుంటే పీఎం మోదీ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా బాయల్డ్, రారైస్ పేరుతో రైతు నడ్డి విరుస్తూన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

also read;-ఉగాది తరువాత కేంద్రానికి వణుకే : మంత్రి పువ్వాడ

పీఎం మోదీ,కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను నిరశిస్తూ ప్రతి రైతన్న తన ఇంటి పైన నల్లజెండా ఎగరవేసి నిరసన వ్యక్తపర్చలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, రైతుబందు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామసహయం ఉమ, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి,షేక్ సుబాన్-బీ, మండల కో-అప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, సర్పంచులు కాస ప్రవీణ్, గుగులోతు సుమన్, భూక్య పద్మావతి, వల్లెపు సోమయ్య, లావుడ్య రమేష్,సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, జిల్లా రైతుబందు కమిటీ సభ్యుడు బొప్పిడి పూర్ణ చందర్ రావు, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి రమేష్,మాజి జడ్పీటీసీ బాలు నాయక్,మాజీ ఎంపీటీసీ బోడ పూలు నాయక్,గ్రామ కో-అప్షన్ సభ్యులు కొలిశెట్టి పూర్ణ చందర్ రావు, మాల్యాల పోశెట్టి,నాయకులు రామసహయం ఉపేందర్ రెడ్డి, వల్లెపు శ్రీనివాస్,ధారవత్ బాలరాజు,మౌలాలనా,గంగాపురం రాజు,వెన్ను పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు