Telugu News

బుట్టాయిగూడెం గ్రామంలో చలివేంద్ర ప్రారంభం

బుట్టాయిగూడెం గ్రామంలో చలివేంద్ర ప్రారంభం

0

బుట్టాయిగూడెం గ్రామంలో చలివేంద్ర ప్రారంభం

(కన్నాయి గూడెం, విజయం న్యూస్) ;-

ములుగు జిల్లా కన్నాయిగూడెం, మండలంలోని శనివారం రోజు బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ బస్సు స్టాప్ తాటి చెట్లవద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమనికి ముఖ్యాతిదిగా కన్నాయిగూడెం, ఎస్ఐ సురేష్, రెబ్బన్ కటింగ్ చేసిప్రారంభించారు, సర్పంచ్ కావేరి పద్మ చిన్నికృష్ణ, మాట్లాడుతూ ఎండాకాలం మాసంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున గ్రామ పంచాయతీ నుండీ ప్రతి రోజు పది కూలింగ్ క్యాన్లను సమకూర్చుతున్నట్లు తెలియచేశారు, ప్రతిరోజు ఒక జిపి సిబ్బందిని నీళ్లు వద్ద కాపలా పెట్టినట్టు చెప్పారు, అది బస్టాప్ కాబట్టి ప్రజలు ఎప్పుడు రద్దీగా ఉండే స్థలం కనుక ప్రయాణికులకు మెరుగైన మినిరల్ కూలింగ్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో, ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు,

also read;-320 కే జి లా గంజాయి పట్టివేత…

ఉపాధి పనులకు వెళ్లి వచ్చే కూలీలకు ఎంతో ఉపయోగ పడుతుందిని కుండలు పెట్టటం మూలంగా నిరుపయోగంగా ఉంటుందని అందుకని కూలింగ్ క్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు, ప్రజలనుండి బారి స్పందన సంతోషం వ్యక్తం చేస్తున్నా ప్రజలు ప్రయాణికులు.ఇలాంటివి పెట్టటం మూలంగా ప్రజల దాహం తీర్చినట్టయినది. సర్పంచుకు ప్రయాణికులు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు సిబ్బంది, జెపిఎస్ ప్రవీణ్ కుమార్, కరొబార్ సమ్మయ్య, జిపి సిబ్బంది, ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ సభ్యులు కలువచ్చెర్ల లక్ష్మీ, వెంకన్నటేశ్వర్లు, పొలయ్య శ్యామ్,నాగరాజు, మావూరి వెంకన్న, జనగామ రవిందర్, జాడీ సూర్యం,అస్సెరిల్లి సమ్మయ్య, శైలేంద్ర, జనగామ మహేష్, దేవర సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.