Telugu News

కూసుమంచిలో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజువేడుకలు

కూసుమంచి-విజయం న్యూస్

0

కూసుమంచిలో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజువేడుకలు

(కూసుమంచి-విజయం న్యూస్):-

కూసుమంచి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూసుమంచి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అయిన మాట్లాడుతూ అకుంఠిత దీక్ష ,కఠోర పట్టుదలతో తెలుగు రాష్ట్రాల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అయిన రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన నేత చంద్రబాబు అని గుర్తు చేశారు. బాల్యదశ నుంచి ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి ఎదిగిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.

also read :-పోడు భూముల పంచాయతీ ఇంకేన్నాళ్లు

చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం కేక్ లు, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జర్పుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మందపల్లి కోటేశ్వరరావు, ఆడప శివ, గోవిందు ఎల్లయ్య, డాక్టర్ నాగరాజు, సైదులు, భాస్కర్ రావు, పాపారావు, వీరయ్య, జగన్, అశోక్, రామనాథం, బాలాజీ తదితరులు పాల్గొన్నారు