Telugu News

చినజీయర్‌ స్వామి క్షమాపణలు చెప్పాలి

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్‌

0

చినజీయర్‌ స్వామి క్షమాపణలు చెప్పాలి
== టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్‌
(భద్రాద్రికొత్తగగూడెం-విజయంన్యూస్):
మేడారం సమ్మక్క, సారలమ్మపై త్రిదండి చిన్నజీయర్‌ స్వామి చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. జీయర్‌ స్వామి సారీ చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా జీయర్‌ పై ఫైర్‌ అయ్యారు. స్వావిూజీ ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

also read;-క‌ష్టప‌డి వ‌చ్చిన విజ‌యంతోనే జీవితాలు రంగుల‌మ‌యం : నామా

ఆదివాసీ ఆరాధ్య దైవాలను కించపరుస్తూ మాట్లాడిన చిన్నజీయర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తన ఫేస్‌ బుక్‌ అకౌంట్లో కాంతారావు పలు పోస్టులు పెట్టారు. ’రూపం లేకపోయినా ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మను కోట్లాది మంది కొలుస్తున్నారు. విూలా మోసం చేయడం మా జాతికి తెలియదు’ అని జీయర్‌ ను ఉద్దేశించి కాంతారావు వ్యాఖ్యానించారు. ఆదివాసీ గూడేల్లో జీయర్‌ స్వామి దిష్టిబొమ్మలను తగులబెట్టాలని పిలుపునిచ్చారు.