నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్
(హైదరాబాద్ విజయం న్యూస్);-
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు.
జైపూర్ టూర్‌లో ఉన్న ఎంపీ సంతోష్ అటు నుంచి డిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి ఎంపీలకు దిశ నిర్దేశం చేయనున్నారు. ధాన్యం కొనుగోలుపై వీలైనంత ఎక్కువగా దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల మద్దతు కూడగట్టే పనిలో కేసీఆర్ ఉన్నారు.
also read :-కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధం కావాలి
సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపిచ్చింది. ఈనెల 11న టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఢిల్లీలో నిరసన చేపట్టనున్నారు. హస్తిన కేంద్రంగా ధాన్యం అంశాన్ని ప్రధాన అంశంగా బీజేపీ వ్యతిరేక శక్తులను సీఎం కేసీఆర్ కూడగట్టనున్నారు.