Telugu News

కోస్తా తీరంలో పారిశ్రామిక కెరటాలు

సీఎం జగన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు

0

కోస్తా తీరంలో పారిశ్రామిక కెరటాలు

== సీఎం జగన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు

(అమరావతి-విజయంన్యూస్);-

వైఎస్ జగన్‌ ప్రభుత్వం వచ్చాక.. కోస్తాంధ్ర అభివృద్ధి పరుగెడుతోంది.. పంట ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ద్వారా…రైతులకు మెరుగైన ఆదాయం లభించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో సెకండరీ…

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఆహార రంగంలో ప్రముఖ సంస్థలతో కలసి, ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద  రూ.100 కోట్లతో  అభివృద్ధి చేసిన మెగా ఫుడ్‌ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిపక్కనే ఏపీఐఐసీ కూడా మరో 50 ఎకరాల్లో ఫుడ్‌ పార్కును అభివృద్ధి చేసింది.

also read :-అభివృద్ధి,ఆరోగ్య తెలంగాణే కేసీఅర్ లక్ష్యం : మంత్రి పువ్వాడ

ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న సంస్థలు మెగా ఫుడ్‌ పార్కులోని కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను  వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, పారిశ్రామిక పార్కులతో కళకళలాడుతున్నాయి.

= ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బారులు

=ఉత్పత్తి ప్రారంభించిన 18 భారీ యూనిట్లు

= రూ.2,971 కోట్ల పెట్టుబడులతో 11,181 మందికి ఉపాధి

= 13,134 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు

= వీటితో రూ.3,037 కోట్ల పెట్టుబడులతో 78,905 మందికి ఉపాధి

= రూ.34,532 కోట్లతో పెట్టుబడులకు సిద్థంగా ఉన్న మరో 35 భారీ యూనిట్లు

=హార్బర్లు, పోర్టులతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం

= 3 పోర్టులకు అదనంగా మరో రెండు పోర్టులు,

= ఏడు ఫిషింగ్‌ హార్బర్లను YS జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

= పోర్టులకు సమీపంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా ..

== నెల్లూరు, ప్రకాశం జిల్లాలో..

రెండు భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.

= రూ.40 వేల కోట్లకుపైగా పెట్టుబడులు…

= సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..

= కోస్తాంధ్ర జిల్లాల్లో గణనీయమైన పారిశ్రామిక పురోగతి కనిపిస్తోంది.

also read :-గాంధేయ మార్గమే మా లక్ష్యం : బత్తుల సోమయ్య

= ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పటికే ….

= రూ.6,008 కోట్ల విలువైన పెట్టబడులు కార్యరూపం దాల్చి..

ఉత్పత్తి ప్రారంభించగా …

= మరో రూ.34,532 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి.

= ఈ ప్రాంతంలో 18 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి.

= వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో …

= కిసాన్‌ క్రాఫ్ట్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,

= అశోక్‌ లేలాండ్, తారకేశ్వర టెక్స్‌టైల్స్,

= వెంకటేశ్వర పేపర్‌ ప్రోడక్ట్స్‌ తదితర సంస్థలున్నాయి.

= ఈ 18 యూనిట్లు రూ.2,971 కోట్ల పెట్టుబడులతో…

= ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా …

= 11,181 మందికి ఉపాధి లభించింది.

= ఇదే సమయంలో 13,134 ఎంఎంఎస్‌ఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా…

= రూ.3,037 కోట్ల పెట్టుబడులతో పాటు 78,905 మందికి ఉపాధి లభించింది.