ప్రాణహిత పుష్కరఘాట్ ను పరిశీలించిన కలెక్టర్
-మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
(వేమనపల్లి-విజయం న్యూస్)
వేమనపల్లి సమీపంలోని ప్రాణహిత పుష్కరఘాట్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుండి 24వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగునున్న పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.పుష్కరఘాట్ వద్ద దుకాణ సముదాయాలు,పార్కింగ్ ఏర్పాటుతోపాటు,భక్తులకు ఏర్పాటు చేసే సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.పుష్కరాల సందర్భంగా ఏర్పాటుచేసే దుకాణాల సముదాయాలకు ఎమ్మార్వో, ఎంపీడీవో, డిపిఓ, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో చర్చించుకుని స్థలాలు కేటాయించాలన్నారు.
also read :-16న మంత్రి కేటిఆర్ ఖమ్మం పర్యటన ఖరారు..
పుష్కరఘాట్‌కు వెళ్లేందుకు భక్తులకు ఇబ్బంది లేకుండా దారి తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నదీతీరంలో లోతుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి భక్తులు అటువైపు వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలని,గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు.మహిళల కోసం బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేయాలని, భక్తులకు తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు.
also raed :-★ తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్,ఆర్డిఓ షామాల దేవి,డీపీవో నారాయణ రావు,ఆర్డబ్ల్యూఎస్ ఆంజన్ రావు,డీఎల్పీవో ఫణిందర్ రావు,తహసిల్దార్ రాజ్ కుమార్,ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య,ఎంపిఓ అనిల్ కుమార్,వేమనపల్లి మండల తెరాసా అధ్యక్షులు కోళి వేణుమాధవ్ రావు,స్థానిక సర్పంచ్ కుబిడే మధుకర్,ఎంపీపీ ఆత్రం గణపతి,మాజీ ఎంపీపీలు ఆకుల లింగాగౌడ్,కుర్రు వెంకటేశం, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మి కాంత్,గొర్లపల్లి సర్పంచ్ మోర్ల పద్మ మొండి,సుంపుటం సర్పంచ్ కొండగొర్ల బాపు, ముల్కలపేట సర్పంచ్ బెడ్డల రాజలింగు,ఎంపీటీసీ దాగమ బాపు, టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.