Telugu News

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

== భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు

0

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

== భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు

== పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట

== మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుకు గాయాలు

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ధరల పెరుగుదల కు నిరసనగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రుక్తత నేలకొంది. ముందుగా ఖమ్మం పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

also read;-తెలంగాణ వడ్లు కోనాల్సిందే..

గ్యాస్ బండలతో, మోటర్ సైకిళ్లను తోచుకుంటూ కార్యక్రమాన్ని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని ముట్టడి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకపోయేందుకు ప్రయత్నంచడం, పోలీసులు అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాయాలైయ్యాయి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బలసౌజన్యకు తీవ్రగాయాలైయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె రెండు చేతుల మూడు వేళ్ళు విరిగినట్లు వైద్యులు నిర్థారించి ఆపరేషన్ చేశారు.

అనతంరం జాయంట్ కలెక్టర్ మదుసూధన్ కు వినతి పత్రం అందజేశారు. పోలీసుల తీరుకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం నందు బేటాయించి నిరసన తెలియజేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దొబ్బల సౌజన్య ను జిల్లా, నగర అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్,మహమ్మద్ జావేద్, జిల్లా కమిటీ బాధ్యలు, అనుబంధ సంఘాలఅధ్యక్షులు, ఇతర నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పై భారం మోపుతూ మాకేం తెల్వదు ఆ ఫార్టీ వల్లనే రేట్లు పెరిగినయ్ అంటూ రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నయని ఆరోపించారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచుతుంటే, రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను, బస్సు చార్జీలను పెంచుతూ రెండు పార్టీలు నాటకాలు అడుతున్నాయని ఆరోపించారు.

also read :-ప్రయాణికులతో ఆర్టీసీ అధికారి దుర్భాషలాట

ప్రజలపై భారం పెంచుతూ అది మర్చిపోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ధర్నాల పేరుతో రోడ్లపైకివచ్చి మీడియాలో చూపిస్తూ ప్రజల ద్రుష్టిని మల్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్లేమి కాదని, ఎం జరుగుతుందో ప్రజలందరు గమనిస్తున్నరని, అవసరమైనప్పుడు, సరైన సమయంలో కర్రు కాచి వాత పెట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, ఆపీస్ ఇన్ చార్జ్ హుస్సెన్ పలుమండల కమిటీ అధ్యక్షులు, తదితరులు హాజరైయ్యారు.
== కూసుమంచి నుంచి భారీ ర్యాలీ
ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న కాంగ్రెస్ ధర్నాకు కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటర్ సైకిళ్ల ప్రదర్శన కార్యక్రమంకు భారీగా స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మోటర్ సైకిళ్లు కూసుమంచిలో భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం ర్యాలీగా ఖమ్మం పార్టీ ఆపీస్ వరకు చేరుకున్నారు.

== పెరిగిన పెట్రోల్-డీజిల్-గ్యాస్-ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కలెక్టరేట్ ముట్టడి.

ఏ.ఐ.సి.సి, టి.పి.సి.సి. పిలుపుమేరకు, పోట్ల నాగేశ్వరావు పర్యవేక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్,ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని, రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ కమిటీ డీసీసీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీలో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంను నిర్వహించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, పేద మధ్యతరగతి కుటుంబాల జీవనం దృష్టిలో పెట్టుకొని విపరీతంగా పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జెబి శౌరీ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోతుకూరి ధర్మారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, జిల్లా మైనార్టీ నాయకులు ఎండీ గౌస్, గరిపేట ఎంపీటీసీ కసానబోయిన భద్రం, మహిళ నాయకురాలు రేణుక, అభి, అరుణ్, వెంకట్, అజ్మీరా సురేష్, బాదావత్ కోటేష్, ఆమ్మో గణేష్, యాలాద్రి, లక్ష్మణ్,గడ్డం రాజశేఖర్, యువకులు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.