Telugu News

పార్లమెంట్ వారిగా ఇన్ చార్జీలను నియమించిన కాంగ్రెస్

హైదరాబాద్-విజయం న్యూస్

0

పార్లమెంట్ వారిగా ఇన్ చార్జీలను నియమించిన కాంగ్రెస్

(హైదరాబాద్-విజయం న్యూస్);-

వచ్చే నెల 6న వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ విచ్చేస్తున్న సందర్భంగా ఆ సభను సక్సెస్ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే వరంగల్ జిల్లాలో పర్యటించిగా, రాష్ట్ర నాయకత్వం వరంగల్ జిల్లాలో పర్యటించిన పరిస్థితి ఉంది.

 

అయితే పార్లమెంట్ వారిగా ఇన్ చార్జ్ లను నియమించాలని భావించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించింది. ఖమ్మం జిల్లాకు కుసుమ కుమార్ ,భువనగిరికి జగ్గారెడ్డి,మహుబూబాద్ కు శ్రీధర్ బాబు, నల్గొండకు గీతా రెడ్డి, కరీంనగర్ కు షబ్బీర్ అలీ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వీరు తక్షణమే బాధ్యతలు తీసుకొని జిల్లాలో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.