Telugu News

పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆందోళన

** విజయవాడలో ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులు

0

పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆందోళన

** విజయవాడలో ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులు

** ధరలు తగ్గించే వారకు కాంగ్రెస్‌ పోరాడుతుందన్న శైలజానాథ్‌

(విజయవాడ-విజయంన్యూస్):-

జాతీయ కాంగ్రెస్‌ పిలుపుతో పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగింది. లెనిన్‌ సెంటర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏపీ పిసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ… మోదీ, జగన్‌ ఇద్దరూ ఒక్కటేనని, కలిసే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మోదీ ఆదేశాలతోనే జగన్‌ పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ… ప్రజలపైనే మోయలేని భారాలు మోపుతున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

also read :-సేంద్రీయ సాగుకు తీసుకున్న చ‌ర్య‌లేంటీ?

పెట్రోల్‌పై పన్నులు, విద్యుత్‌ ఛార్జీలను జగన్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మోదీ, జగన్‌లు ఆడే జగన్నాటకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వారంరోజుల పాటు ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. మోదీ మాయలో ఉన్న జగన్‌ కళ్లు తెరవాలని.. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని శైలజానాథ్‌ హెచ్చరించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని శైలజనాథ్‌ వెల్లడిరచారు.

కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులను చూసి ప్రస్తుతం పాత చార్జీలు కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు మరింత దెబ్బ అని, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రో, గ్యాస్‌ ధరలతో అల్లాడుతున్న తరుణంలో ఈ చార్జీల పెంపు తగదని అన్నారు. చార్జీలు తగ్గించని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తుందని హెచ్చరించారు.

also read :-విద్యుత్‌ ఛార్జీల పెంపుపై మండిపడ్డ టిడిపి

అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని శైలజనాథ్‌ డిమాండ్‌ చేశారు.విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయాన్ని శైలజనాథ్‌ తప్పు పట్టారు. ఈఆర్‌సీ ప్రకటించిన వివరాల ప్రకారం 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంచారని, అలాగే, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నారని, విూ నిర్వహణ లోపం, చేతకానితనంతో పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తారా అని శైలజానాథ్‌ ప్రశ్నించారు.