Telugu News

పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్‌

దేశవ్యాప్తంగా దద్దరిల్లిన నిరసనలు

0

పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్‌

** దేశవ్యాప్తంగా దద్దరిల్లిన నిరసనలు

** పార్లమెంటులో నిలదీసిన కాంగ్రెస్‌ ఎంపిలు

** విజయ్‌ చౌక్‌ వద్ద రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా

** మధ్యప్రదేశ్‌,చెన్నై, తెలుగు రాష్టాల్ల్రోనే నిరసనలు

(హైదరాబాద్, న్యూఢిల్లీ- విజయంన్యూస్):-

ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ మండిపడిరది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెంచిన ధరలను పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇంధన ధరల పెంపు.. సామాన్యుడికి భారంగా మారిందని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్‌ చౌక్‌లో ధర్నా నిర్వహించారు.

also read;-కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలి.

అంతకుముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రో ధరలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారని మోడీ సర్కారుపై రాహుల్‌ గాంధీ విమర్శలకు దిగారు. చమురు ధరలు భగ్గుమంటుంటే ఫకీరుని ప్రశ్నించినా మోడీ గురించి అన్నారు. జోలె పట్టుకుని మాయమాటలతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారంటూ దుయ్యబట్టారు. ఆసియాలోని పలు దేశాల పెట్రో రేట్లు, భారత్‌లో ఉన్న చమురు ధరలను పోల్చుతూ రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ’పెట్రోల్‌ రేట్లను భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. అఫ్గానిస్థాన్‌ లో రూ.66.99, పాకిస్థాన్‌ లో రూ.62.38, శ్రీలంకలో రూ.72.96, బంగ్లాదేశ్‌ లో రూ.78.53, భూటాన్‌ లో రూ.86.28, నేపాల్‌ లో రూ.97.05,
ఇండియాలో రూ.101.81గా ఉంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

also read;-ఢిల్లీ కి వెళ్తున్న కే సి ఆర్ వైద్యం కోసం

ధరల పెరుగుదల నుంచి భారత్‌ కు విముక్తి కలగాలనిహ్యాష్‌ ట్యాగ్‌ ను ట్వీట్‌ కు జత చేశారు. ఇకపోతే పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢల్లీిలోని విజయ్‌ చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ ఎంపీలు ప్రదర్శన చేపట్టారు. ’మెహంగాయి ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ అనే పేరుతో నిరసనలకు దిగారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారినా చలించడం లేదని రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో పేదవారి నుంచి ప్రభుత్వం డబ్బులు దోచుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది. ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని నేను ఇంతకుముందే చెప్పాను.

also read;-మరో 15 రోజులు ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు – హోంమంత్రి

ఇప్పుడదే జరుగుతోందని రాహుల్‌ గాంధీ అన్నారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసిస్తూ.. మధ్యప్రదేశ్మాజీ సెం కమల్‌నాథ్‌ ఆధ్వర్యంలో మహిళలు ధర్నాలకు దిగారు. గ్యాస్‌ సిలిండర్లకు దండలు వేస్తూ నిరసనలు చేపట్టారు. చెన్నైలోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పలు రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ నేతృత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

also read;-మోడీజీ… మీరిచ్చిన మాటేమాయే

పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధనం ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ ఎంపీలు.గత 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్‌,డీజిల్‌ రేటు పెరిగిందన్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నామని కాంగ్రెస్‌ నేత ఖర్గే అన్నారు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరి, మల్లికార్జున్‌ ఖర్గే, అభిషేక్‌ సింఫ్వీులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.