Telugu News

ఖమ్మం కార్పోరేషన్ లో అవినీతి అధికమైంది

అభివద్ది పేరుతో అంతా దారుణమే జరుగుతోంది

0

ఖమ్మం కార్పోరేషన్ లో అవినీతి అధికమైంది
== అభివద్ది పేరుతో అంతా దారుణమే జరుగుతోంది
== ప్రతిపక్ష కార్పోరేటర్లపై మంత్రి, కార్పోరేషన్ మేయర్ కక్ష్యకట్టారు
== అధికార పార్టీకే పోలీసులు దాసోహం అయ్యారు.
== విలేకర్ల సమావేశంలో ద్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు, కార్పోరేటర్లు

(ఖమ్మం విజయం న్యూస్):-

ఖమ్మం కార్పోరేషన్ లో అవినీతి అధికమైందని, అధికారప్రజాప్రతినిధులకు అధికారులు దాసోహమైయ్యారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగరకమిటీ అధ్యక్ష్యడు ఎం.డీ.జావిద్, కార్పోరేటర్లు ద్వజమెత్తారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జావిద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని అన్నారు.

also read;-చింతకాయలు కోయబోయి.. కిందపడి.. చనిపోయిడు
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కనుసన్నల్లోనే పోలీస్ యంత్రాంగం అంతా నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఏది చెబితే అదే అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడే వారిపై అక్రమ కేసులు బాణాయిస్తున్నారని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ కార్పొరేటర్లపై జరిగే దాడులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి అణచివేయడం హేయమైన చర్య అని అన్నారు. అధికారం చేతులో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అక్రమాలకు పాల్పడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా నడవాల్సిన వ్యవస్థలే నేడు ఒకరి చెప్పు చేతల్లో ఉంటే ప్రజాస్వామ్య మనుగడ కష్టమవుతోందని అన్నారు. పదువులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి తగు బుద్ధి చెబుతారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కార్పొరేటర్లపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

లేదంటే అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అలాగే కార్పోరేటర్లు మాట్లాడుతూ ఖమ్మం కార్పోరేషన్ లో అభివద్ది పేరుతో దారుణమైన మోసం, దగా, అక్రమాలు జరుగుతున్నాయిని వాపోయారు. మంత్రులు వస్తున్నారనే సాకుతూ ఎలాంటి టెండర్లు లేకుండా పనులు చేస్తూ తక్కువ పనికి ఎక్కవు డబ్బులు డ్రా చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ కూడా తనిఖీలు లేవని, అధికారులు కూడా కాంట్రాక్టర్లకు, అధికార కార్పోరేటర్లకు దాసోహం చేస్తున్నారని ఆరోపించారు.

also read:-పోదం పావే బిడ్డో సర్కార్ కూసుమంచి దవఖానకు

కాంగ్రెస్ కార్పోరేటర్లకు ఒక్కరూపాయి కూడా అభివ్రద్ది కోసం కేటాయించడం లేదని, మొన్న సమావేశంలో గట్టిగ అడిగితే నిధులు కేటాయిస్తామని చెబుతూనే వాటికి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్పోరేటర్ల అందరు సమానమనే విషయాన్ని మేయర్ అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్, జిల్లా సీనియర్ నాయకులు రాయల నాగేశ్వర్ రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ఖమ్మం నగర కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేందర్, రఫీదా బేగం, మలీద్ వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, బద్దె నిరంజన్, సరితా ఉపేందర్, కామేపల్లి జెడ్పిటీసీ భాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.