ఇందిరాపార్కు వద్ద సీపీఐ నిరసన
—ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలని డిమాండ్
( హైదరాబాద్- విజయం న్యూస్):-
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం అనాలోచితంగా భద్రాచలం నుంచి విడదీసి ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషారాష్ట్ర కమిటీ సభ్యులు కల్లూరివెంకటేశ్వరరావు,గుత్తులసత్యనారాయణ, దొండపాటి రమేశ్, భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్, వీసంసెట్టి పూర్ణచందర్‌రావు, సాయికుమార్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎస్‌కె సాబీర్ పాషా మాట్లాడుతూ, అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకవచ్చి భద్రాచలం ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
also read :-పరువునష్టం కేసు..ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ
5 గ్రామ పంచాయతీల ఉద్యమాన్ని అవసరమైతే ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్తామని, భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం ఐదు పంచాయతీలు తెలంగాణలో విలీనం చేసేంతవరకు సిపిఐ పోరాటం ఆగదని స్పష్టం చేశారు భద్రాచలం పట్టణానికి కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందని, భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ పొడిగించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేసి భద్రాచల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నోముల రామిరెడ్డి, మారెడ్డి గణేష్, ప్రదీప్, తిరుపతి రావు, శివ, రంజిత్, రత్న కుమారి, నిర్మల, మున్నా లక్ష్మి కుమారి తదితరులుపాల్గొన్నారు.