ప్రజా నివాసానికి ఆటంకం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి
—సిపిఎం జిల్లా కమిటీ వినతి
(ఖమ్మం విజయం న్యూస్):-
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ లో శాస్త్రీయ పద్ధతిలో ప్రజా నివాసాలకు ఇబ్బంది కలిగే విధంగా అనేక ప్రాంతాలలో రహదారులకు తీసినట్టు చర్చ జరుగుతుందని పూర్తి శాస్త్రీయ పద్ధతిలో ప్రజా నివాసానికి ఇబ్బంది లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ ను మార్చాలని కోరుతూ ఖమ్మం నగర అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరి కి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.
also read;-పండుగ పూట భార్యను భర్త కత్తితో దాడి
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్ మాట్లాడుతూ నగరంలో శ్రీనివాస్ నగర్ రోడ్డు ని వంద అడుగుల రోడ్డు గా మార్చి 60 అడుగుల ప్రధాన రహదారి కలుగుతున్నట్టు చర్చ జరుగుతుందని, హవేలీ ప్రాంతంలో ఆరోవ డివిజన్ లో అవసరం లేకపోయినా సరే 40 అడుగుల ఉండాల్సిన రోడ్డును 60 అడుగుల కి ప్రతిపాదించినట్టు, ఇదే పద్ధతిలో రమణ గుట్ట ఏరియాలో, ఖమ్మం అర్బన్ మండలం అగ్రహారం ఏరియాలో, ఇంకా కార్పొరేషన్ పరిధిలో కొన్నిచోట్ల ఇటువంటి ప్రతిపాదనలు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించినట్టు చర్చ జరుగుతుందన్నారు. దీనివలన ఆయా నివాస ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున శాస్త్రీయ పద్ధతిలో ప్రజా నివాసానికి ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వారు సూచించారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు ఎర్ర శ్రీనివాస రావు, జబ్బార్,తుశాకుల లింగయ్య , దొంగల తిరుపతిరావు, నవీన్ రెడ్డి, భూక్యా శ్రీనివాస రావు,