Telugu News

ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో అలజడి సృష్టించారు..

ఖమ్మం విజయం న్యూస్

0

ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో అలజడి సృష్టించారు..

(ఖమ్మం విజయం న్యూస్ ):-

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై బిజెపి నేతలు చేస్తున్న చిల్లర మల్లర వ్యాఖ్యలను ఖందిస్తు మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో బిసీ కార్పొరేటర్లు, బిసీ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

also read :-ఇరవండి గ్రామంలో రైతు గోస దీక్ష లో పాల్గొన్న వైఎస్ షర్మిల

బీసీ సంఘం జిల్లా నాయకులు వద్దిరాజు రవిచంద్ర గారు, RJC కృష్ణా గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు, కార్పొరేటర్లు దొరెపల్లి శ్వేత, రుద్రగాని దేవి, గజ్జెల లక్ష్మి, తోట గోవిందమ్మ, గోళ్ళ చంద్రకళ, ముక్కాల కమల, తోట ఉమారాణి, రాపర్తి శరత్, కమర్తపు మురళి, నాయకులు పగడాల నాగరాజు, షకీన, తోట వీరభద్రం తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) మాట్లడుతూ..

అభ్యుదయ భావాల వేదిక ఖమ్మం.. ఇక్కడ మతోన్మాద పార్టీలకు స్థానం లేదని, మతాలు, కులాల మధ్య చిచ్చు రగిల్చి.. లబ్ధి పొందాలనుకునే వారిని జిల్లా ప్రజలు సహించరన్నారు.

బీజేపీ కార్యకర్త చనిపోవడం బాధాకరం.. కేసులున్నాయని ఆత్మహత్య చేసుకోవడం సరికాదు.. న్యాయ పరంగా కేసులు ఎదుర్కోవాలే తప్ప చావు పరిష్కారం కాదని హితువు పలికారు..కేసులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి.. తెలంగాణ ఉద్యమకారులందరిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని, అంత మాత్రాన అందరూ ఆత్మహత్యలు చేసుకోలేదని గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం అదే స్థాయిలో అభివృద్ధి పుంతలు తొక్కుతోందని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అవుతోందని వివారించారు.మంత్రి అజయ్ కుమార్ కి బీసీ సంఘాల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు.

పలువురు వక్తలు మాట్లడుతూ…

ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు ఎన్నడు లేని విధంగా బిజేపి, కాంగ్రెస్ పార్టీలు భయానక వాతావరణం తీసుకొచ్చారని అన్నారు.సాయి గణేష్ మరణాన్ని బూతద్దంలో చూసి, ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

also read :-నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క

పనికొచ్చే అనేక విషయాలను వదిలేసి చిన్న ఘటన ను భుజాలకు ఎత్తుకుని రచ్చ రచ్చ చేయడం సిగ్గుచేటన్నారు.కేవలం సొంత ప్రయోజనాల కొసం ఇంతటి దిగజారి మాట్లాడడం మీకే సాద్యపడిందన్నరు.ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఖమ్మం నగరంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మీకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని ఒప్పుకునే దమ్ము లేక నిందలు వేయడంలో ముందున్నారని విమర్శించారు.రాజకీయ పార్టీల నాయకులపై కేసులు ఉండటం సర్వసాధారణం అయిన విషయం.. ఉద్యమ నాయకుడిగా ఉన్న నాటి కాలంలో నేటి ముఖ్యమంత్రి కేసీఅర్, హరీష్ రావు గారు, కెటిఆర్ గారు, అనేక మంది మీద కేసులు ఉన్నాయన్నారు.

also read :-డిచ్పల్లిలో ఘోర ప్రమాదం

సాయి గణేష్ మరణాన్ని ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు.. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది మంత్రి పువ్వాడ అజయ్  స్థాయి ఎంత బలంగా ఉందో…ఎంత మంది వచ్చినా మీ పాబ్బం గడవడని ఇప్పటికైనా అర్థమైందా ఆని వ్యాఖ్యానించారు. ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఖమ్మం ప్రజల మనసులలో నుండి అజయ్ గారిని వేరు చేయలేరన్నారు.

రేవంత్ రెడ్డి, గుండు గాడు, బొడి గాడు అందరు కట్టకట్టి కలిసి వచ్చినా, అంతకు మించి ఎవడు వచ్చినా మీతో అయ్యేది ఏమీ లేదని స్పష్టం చేశారు.కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే మిమ్మల్ని ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నటికి ఆదరించారని గుర్తుంచుకోవాలన్నారు. ఖమ్మం ప్రజలు మీకంటే చైతన్యవంతులు, అందుకే అజయ్ ని రెండు సార్లు గెలిపించారని అన్నారు.

ఏళ్లనాటి నుండి వివక్షకు గురైన ఖమ్మం ఇప్పుడిప్పుడే అభివృధ్ధిని చూస్తుందని, ఈలోగా బిజేపి నేతలు నరకాసురుడి వలే వచ్చి అభివృద్ధిని అడ్డుకుని మీ ఎజెండాను అమలు చేయాలని చూస్తారా ఆని విమర్శించారు.