Telugu News

బీజేపీ ని ఓడించటమే కుంజా బొజ్జి కి నివాళి

ప్రథమ వర్దంతి సభ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

0

బీజేపీ ని ఓడించటమే కుంజా బొజ్జి కి నివాళి

—-ప్రథమ వర్దంతి సభ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

( భద్రాచలం -విజయం న్యూస్):-

మతోన్మాద విధానాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, నిరంకుసంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించటమే కుంజా బొజ్జికి అర్పించే నిజమైన నివాళి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన కుంజా బొజ్జి చివరి కోరిక బీజేపీని ఓడించటనేనని తమ్మినేని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి ప్రథమ వర్దంతి సభ శనివారం భద్రాచలంలోని రాజుపేట కాలనీలో నిర్వహించారు.

సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తమ్మినేని ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ, మూడు సార్లు ఎమ్యెల్యేగా సీపీఎం తరపున గెలిచిన కుంజా బొజ్జి తన తుది శ్వాస వరకు పేద ప్రజల కు సేవాలందించారని అన్నారు. నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరుగా అందరి మన్ననలు పొందారని తమ్మినేని గుర్తు చేశారు. నేడు దేశంలో రాష్ట్రంలో పాలకులు తమ నియంతృత్వ విధానాలతో ప్రజలకు తీరని హాని చేస్తున్నారని ఆయన అన్నారు.

also read;-మండలంలో వాహనాల తనిఖీ

భవిష్యత్‌లో సీపీఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజాఉద్యమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు తమ్మినేని తెలిపారు. సభకు ముందు నూతనంగా ఏర్పాటు చేసిన కుంజా బొజ్జి స్థూపాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. ఈ సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్, రాష్ట్ర నాయకులు మిడియం బాబూరావు, పోతినేని సుదర్శన్, పి. సోమయ్య, బి.రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజె రమేష్ స్థానిక నాయకులు ఎం బాలనర్సా‌రెడ్డి, బి. వెంకటరెడ్డి, ఎం రేణుక తదితరులు పాల్గొన్నారు.