Telugu News

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇంటిపై దాడి విషయంలో 8మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

8మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

0

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇంటిపై దాడి విషయంలో

 

8మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

 

(న్యూఢిల్లీ-విజయంన్యూస్);-

ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ అధికార నివాసంపై దాడికేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో అబద్దాలున్నాయని సీఎం కేజీవ్రాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్‌ పండిట్లను కేజీవ్రాల్‌ అవమానిం చారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అధికార నివాసం గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు.

also read :-శ్రీశైలంలో కన్నడ భక్తుల దాడి

సెక్యూరిటీ బారికేడ్లను దాటుకొని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మందిని ఢల్లీి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా, ఈ వ్యవహారంపై సిట్‌ వేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ ఢల్లీి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దర్యాప్తు స్వతంత్రంగా జరిగేలా చూడాలని, నిర్ణీత కాలవ్యవధిలోపు విచారణ ముగిసేలా ఆదేశించాలని కోరారు. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్‌  సినిమాపై కేజీవ్రాల్‌ ఢల్లీి అసెంబ్లీలో మాట్లాడిన విషయం తెలిసిందే. సినిమాలో పండిట్లను తరిమేసినట్లు, ఊచకోత కోసినట్లు చూపించడం అబద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రానికి బీజేపీ చేస్తున్న ప్రచారంపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు.