Telugu News

కార్పొరేట్ గద్దల సేవలో ఢిల్లీ పెద్దలు

మోడీ ప్రభుత్వం రైతులకు ప్రాణ సంకటం

0

కార్పొరేట్ గద్దల సేవలో ఢిల్లీ పెద్దలు

—-మోడీ ప్రభుత్వం రైతులకు ప్రాణ సంకటం

—-తెలంగాణ రైతుల పోరాటాలకు విలువ లేదా?
—-మా బతుకంతా ఉద్యమాలేనా

—-కాంగ్రెస్, బీజేపీలు దేశానికి పట్టిన శని

—-ఢిల్లీని కదిలించి వడ్లు కొనిపిస్తం

—-పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కామెంట్స్
—-బైకుర్యాలీ, దిష్టిబొమ్మ దగ్దం

—-ఇంటింటిపై ఎగిరిన నల్ల జెండాలు

—-పల్లెపల్లెనా రైతన్నల నిరసన సెగలు

(నిజామాబాద్ విజయం న్యూస్);-
ప్రభుత్వ రంగ సంస్థలను భోంచేస్తున్న కార్పొరేట్ గద్దల సేవలో తరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ పెద్దలు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీవన్ రెడ్డి రైతులతో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణములో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు ప్రాణ సంకటంగా మారిందన్నారు

also read :-ఇంటికి నల్ల జెండాను కట్టి నిరసన వ్యక్తం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
“తెలంగాణ రైతుల పోరాటాలకు విలువ లేదా?.మా బతుకంతా ఉద్యమాలేనా? 60ఏండ్లు గోసపడి రాష్ట్రం వచ్చి కుదుట పడుతున్న తెలంగాణ ప్రజల బతుకులను బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రోడ్డున పడేసే కుట్రలు చేస్తున్నది. నిన్నటి వరకూ రాష్ట్రం కోసం పోరాడాం. ఇప్పుడు రైతుల కోసం పోరాడుతున్నాం.
కాంగ్రెస్, బీజేపీలు దేశానికి పట్టిన శని
ఢిల్లీని కదిలించి వడ్లు కొనిపిస్తం”. అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
రైతుల పై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజు ఎంతో దూరం లేదన్నారు. నూకలు తినమని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపర్చిన మంత్రి పీయూష్ గోల్ మాల్ తరిమి కొడతామన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోది.
చెవులుండి వినలేని బండ ప్రభుత్వం.
గుజరాతీ బేరగాళ్ల పార్టీ బీజేపీ.
దేశానికి అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతుండ్రు.తెలంగాణ రాష్ట్ర రైతులను చూసి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
ఆరు నెలలుగా రైతులు పోరాడుతుంటే కేంద్రం స్పందించడం లేదు.పైగా తెలంగాణ ప్రభుత్వం పై ఎదురు దాడి చేస్తుండ్రు.రైతుల తరపున కేంద్రంతో పోరాడాల్సిన రాష్ట్ర బీజేపీ నాయకులు సిగ్గూ ఎగ్గూ లేకుండా ఢిల్లీలో చెక్క భజన చేస్తుండ్రు.తొండి సంజయ్ సొల్లు పురాణం చెప్పుతుండం.
అరగుండు అరవింద్ బూతు పురాణం వినిపిస్తున్నడు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి తేకుండా పట్ట పగలే పారిపోయిన లంగ, లఫంగ, లత్కోర్ ఎంపీ.
ట్రిబుల్-ఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు పత్తా లేకుండాపోయిండ్రు.
బీజేపీ రైతుల కడుపు కొడుతుంటే.. కాంగ్రెస్ రైతుల గుండెల మీద తంతున్నది. రాహుల్ గాంధీ నోరు పార్లమెంటులో పెగలడం లేదు.
లోపల ముద్దులాట బయట గుద్దు లాట.పనికిమాలిన ట్వీట్లు చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ రైతులపై మొసలి కన్నీరు కారుస్తుండు.
టీఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంటు లో వెల్ లోకి వెళ్లి పోరాడుతుంటే రాష్ట్ర బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు సోది కబుర్లతో చోద్యం చూస్తున్నారు.రాహుల్ ,రేవంత్ రెడ్డి బీజేపీకి వంత పాడుతున్నారు.

also read :-రైతుల కోసం కొట్లాడుతున్న అన్న కేసీఆర్ కేంద్రం వద్ద ఎందుకు సంతకం పెట్టాడు…
టీఆర్ ఎస్ ది వడ్లగోల అయితే కాంగ్రెస్, బీజేపీలది ఓట్ల, సీట్ల గోల.
రాష్ట్రంలో రైతాంగానికి అండగా నిలబడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని జీవన్ రెడ్డి అన్నారు .రాష్ట్రంలో పండిన ప్రతీ వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.ఆహార భద్రత చట్టం ప్రకారం దేశం లో పండిన ప్రతీ వరి గింజను, గోధుమ గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
వరి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తో పాటు బిజెపి నేతలు రైతులను రెచ్చగొట్టారని,వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎక్కడ నిద్ర పోతున్నారని ఆయన మండిపడ్డారు

also read :-ఇంటికి నల్ల జెండాను కట్టి నిరసన వ్యక్తం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
2014 కు ముందు కరెంట్ కోసం, నీటి కోసం, ఎరువుల కోసం మండల కేంద్రాల్లో ధర్నాలు జరిగేవి. ఇప్పుడు ఎటూ చూసిన ధాన్యపు రాశులతో తాము పండించిన పంటలను కోనాలని ధర్నాలు చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. ఏడు ఏళ్ల లోనే 23 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశం లొనే ప్రధమ స్థానం లోకి వచ్చిన తెలంగాణ దేశంలో మిగతా రాష్టాలకు రోల్ మోడల్. దీన్ని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా కేంద్రంలో ఒకలా ,రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్నది.
బిజెపి దుర్మార్గపు రాజకీయాలను అడ్డుకుంటాం అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.