ఖమ్మంలో కాంగ్రెస్ ఆందోళన
—పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్
(ఖమ్మం విజయం న్యూస్);-
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన గ్యాస్ విద్యుత్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పిలుపుమేరకు మంగళవారం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నాచౌక్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు.
also read :-ఖమ్మంలో 16న మంత్రి కేటిఆర్ పర్యటన
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు లో కేంద్రం రాష్ట్రం డ్రామాలు కట్టిపెట్టి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో ఖమ్మం నగర కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, విద్యుత్ , ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.