బిజెపి శ్రేణుల నిర్బంధ అరెస్టులు అప్రజాస్వామికం
**బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దురిశెట్టి సంపత్
(కరీంనగర్ విజయం న్యూస్):-
మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా జిల్లాలో బిజెపి, బీజేవైఎం శ్రేణులను ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని, నిర్బంధఅరెస్టులు అప్రజాస్వామికమని బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్ తెలిపారు. మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన ప్రతిపక్ష పార్టీ శ్రేణులనిర్బంధ అరెస్టులతో కొనసాగించడం దారుణమన్నారు .
also read;-గౌరవం ఇవ్వని చోట ఉండలేను:- రాజగోపాల్ రెడ్డి
మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ పార్టీ ఎలాంటి ప్రకటన చేయకున్న ముందస్తు అరెస్టులు ఎందుకు చేశారని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తుందని, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా జీవించకుండా ప్రతిపక్షాలను అణగదొక్కాలని ప్రయత్నించడం దారుణమన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్ , చొప్పదండి బిజెపి, బీజేవైఎం శ్రేణులను అకారణంగా ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ అభద్రతా భావం తో ఉన్నారని, అందుకే బీజేపీ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేయిస్తున్నారని , ఇది పిరికిపందల చర్య అని ఆయన అభివర్ణించారు.