అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్….
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్….
అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…
( చండ్రుగొండ -విజయం న్యూస్):-
అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా మారిందని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండల పర్యటనలో భాగంగా ఆయన తిప్పన పల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టిఆర్ఎస్ దిమ్మె పై పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. గ్రామస్తులు వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. అదేవిధంగా ఇటీవల తిప్పన పల్లి గ్రామంలో ప్రమాదంలో గాయపడిన మహిళకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఎలాంటి సమస్యలు ఉన్నా తను స్వయంగా కలవచ్చా అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
also read :-ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ 31 వ, వర్ధంతి వేడుకలు…….
తెలంగాణ ఉద్యమంలో ముందున్న వర్గాలను కలుపుకుని అభివృద్ధి ప్రామాణికంగా ముందుకు సాగుతాం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడంలో కార్యకర్తలు ముందు ఉండాలన్నారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపై క్రియాశీలకంగా మారాలనుకోవడం శుభసూచకం అని అన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ శవ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దా రా బాబు, ఉప్పుతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఎంపీటీసీ దారా వెంకటేశ్వరరావు, లంక విజయలక్ష్మి,టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడ మోహన్ రావు, జడ వెంకయ్య, గాదె శివ ప్రసాద్, భూపతి రమేష్, భూపతి శ్రీనివాస్ రావు, గూగులోతు రమేష్, కళ్ళం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు