Telugu News

టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి జరుగుతుంది : నామా నాగేశ్వరరావు

మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.

0

టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి జరుగుతుంది : నామా నాగేశ్వరరావు
▪️ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.
▪️ దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయని విధంగా మన రాష్ట్రంలో దళిత బంధు పథకం తీసుకువచ్చిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్
▪️ చింతకాని మండలం మొత్తం దళిత బంధు అమలు మనకు గర్వకారణం.
▪️ చింతకాని మండలంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటన.
▪️ నేరడ, నాగులవంచ గ్రామాల్లో పలు పార్టీల నుండి TRS లోకి భారీ చేరికలు.

▪️ నేరడ గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన ఎంపీ నామ, జడ్పీ చైర్మన్ కమల్ రాజు.

▪️ నాగులవంచ గ్రామంలో భారీ ర్యాలీ తో కదం తొక్కిన గులాబీ శ్రేణులు..స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు, మహిళలు.

▪️ టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ నామ నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.
(చింతకాని/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం, అభివృద్ధి లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని ఖమ్మం ఎంపీ, టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం చింతకాని మండలం, నాగులవంచ, నేరడ గ్రామాల్లో జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ,సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తో కలసి పర్యటించారు. అందులో భాగంగా ముందుగా నేరడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల నుండి పలు కుటుంబాల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎంపీ నామ నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

also read;-సాయుధ బలగాలకు 100 రోజుల సెలవులు!

అనంతరం అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించారు. అక్కడ నుండి నాగులవంచ గ్రామానికి చేరుకున్న ఎంపీ నామ, కమల్ రాజు కు టీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు భారీ ర్యాలీ తో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నాగులవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పలు రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అక్కడ ప్రజలు, నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను అక్కడ కూడా అమలు చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.

also read;-ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇస్తాం : మంత్రి పువ్వాడ

దేశంలో ఏ నాయకుడు ఇన్ని ఏళ్ల కాలం లో దళితులు గురించి వారి సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పేరుతో దళిత కుటుంబాల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.10 లక్షల రూపాయల ఆర్దిక సహాయం అందిస్తున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపికైన నాలుగు మండలాల్లో మన చింతకాని మండలం ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేయడం గర్వకారణం అన్నారు ఇప్పటికే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని త్వరలోనే ఆ లబ్ది దళిత కుటుంబాలకు చేరుతుందన్నారు. మరో పక్క పల్లె ప్రగతి తో గ్రామాల్లో పంచాయతీ లకు ట్రాక్టర్లు అందించారని అలానే వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డు లు ఏర్పాటు తో పాటుగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు గ్రామ అభివృద్ధి కోసం మల్టీ పర్పస్ వర్కర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు అలానే పెన్షన్లు భారీగా పెంచి అందించడం జరుగుతోందని అలానే గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లగా మార్చడం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటిసి తిరుపతి కిషోర్, రైతు బంధు మండల కన్వీనర్ కిలారి మనోహర్, సొసైటీ చైర్మన్ లు నల్లమోతు శేషగిరిరావు, కొండపల్లి శేఖర్ రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, నూతలపాటి వెంకటేశ్వరరావు, శిలివేరు సైదులు, ముప్పిడి వెంకన్న, వివి సత్యనారాయణ, మధిర టౌన్ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి వెంకట నరసయ్య, నారపోగు నాగయ్య , కొల్లి బాబు, సర్పంచ్ లు పరిటాల యలమంద, సురేష్, సోషల్ మీడియా పరిటాల రాము పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు