క్రమశిక్షణ మీరితే ఎవరికైనా వేటు తప్పదు:- బండి సంజయ్
(కరీంనగర్ విజయం న్యూస్);-
కరీంనగర్:-తెలంగాణలో సీఎం కేసీఆర్ పనైపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.కరీంనగర్లో భాజపా పదాధికారుల భేటీలో సంజయ్ పాల్గొన్నారు.ఈ మేరకు దేశ రాజకీయాలంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకాలు మొదలెట్టారని విమర్శించారు.
also read ;-ఇక్కడ నేనే ‘బాస్
భాజపాపై కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతున్నారు.మున్ముందు భాజపా శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవు.తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది.ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారు.సీనియర్ నాయకులైనా.. క్రమశిక్షణ మీరితే వేటు తప్పదు ’’ అని సంజయ్ స్పష్టం చేశారు.