Telugu News

గిరిజన బిల్లు ప్రవేశపెట్టనందుకు నిరసన.. దిష్టి బొమ్మ దహనం..

ఖమ్మం విజయం న్యూస్

0

గిరిజన బిల్లు ప్రవేశపెట్టనందుకు నిరసన.. దిష్టి బొమ్మ దహనం..

(ఖమ్మం  విజయం న్యూస్):-

నిన్న పార్లమెంటులో గిరిజన శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు గిరిజన బిల్లు పంపలేదని అబద్దపు మాటలు మాట్లాడిన వైఖరికి నిరసనగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కమిటీ అధ్వర్యంలో మంచుకొండ సెంటర్ లో మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం కేంద్ర మంత్రి దిష్టి బొమ్మ దహనం చేసి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సంధర్భంగా పలువురు వక్తలు మాట్లడుతూ..

గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారని, రాజ్యాంగాన్ని అవమానపర్చారని ద్వజమెత్తారు.కేంద్రం ప్రభుత్వ విధానాలు, వారు మాటలు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయన్నారు.

తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగిందన్న విషయం మీకు తెలియకపోవడం విచారకరమన్నారు.ముఖ్యమంత్ర కేసీఅర్  స్వయంగా 2018, 2019లో ప్రధాని మోదీని కలిసి వారు రాసిన లేఖను ఇవ్వడం జరిగిందని, ఇది రాజ్యాంగపరంగా మా హక్కుని సవివరంగా చెప్పడం జరిగిందన్నారు.

గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, దాన్ని కప్పిబుచ్చడానికి కేసీఅర్  మీద తెలంగాణ ప్రభుత్వం మీద అపవాదులు వేసేలా కేంద్ర మంత్రి చర్యలు ఉన్నాయని నాయకులు విమర్శించారు.