Telugu News

హరిప్రియకు టిక్కెట్.. పెదవి విరుస్తున్న అసంతృప్తి వాదులు

రెండు వర్గాలుగా విడిపోయిన బి ఆర్ ఎస్ టీం

0

ఇల్లందులో పెదవి విరుస్తున్న అసంతృప్తి వాదులు

== హరిప్రియకు టిక్కెట్ కేటాయింపుతో బహిరంగ ఆరోపణలు

– ఇప్పటికే సమావేశమైన నేతలు

– రెండు వర్గాలుగా విడిపోయిన బి ఆర్ ఎస్ టీం

– ఓ పక్క సంబరాలు జరుపుకుంటున్న హరిప్రియ వర్గం

– మరోపక్క ఓటమి లక్ష్యంగా ఎదురు చూస్తున్న కీలక నాయకులు

– త్రిసభ్య కమిటీ ఏం చేస్తుందో ఆలోచిస్తున్న విశ్లేషకులు

(ఇల్లందు -విజయం న్యూస్)

అనుకున్నదొక్కటి .అయ్యిందొకటి ,బి ఆర్ ఎస్ వ్యతిరేక వర్గం బోల్తా పడింది . ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పని చేయమని ఇదివరకే ప్రకటించారు. ఐదు మండలాల చెందిన కీలక నాయకులు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. హరి ప్రియ టికెట్ ఇస్తే సహకరించబోమని సు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కేటాయించడం పట్ల ప్రముఖ వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు అంతా పెదవి విరుస్తున్నారు. గెలుపు ఓటముల్లో వ్యతిరేక నాయకుల పాత్ర కీలకం కానుందని  రాజకీయ  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .మరోపక్క సీఎం ట్విస్ట్ ఇస్తూ త్రిసభ్య కమిటీతో ఒకవేళ అభ్యర్థులు మార్చవలసి వస్తే ఆలోచిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంపై విజయం ప్రత్యేక కథనం.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై..?

     ఇల్లందుకు అరుదైన చరిత్ర. ఒకప్పుడు బొగ్గుటకు ముద్ర పడింది. బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఇప్పుడు బొగ్గుట్ట గురించి చర్చించుకోవాల్సి వస్తుంది. రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే కమ్యూనిస్టు, విప్లవ పార్టీలది ఆదిపత్యం. ట్రెండు మారింది. ఊహించని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం విజయం సాధించింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది .  2014లో కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి  టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు .ఆ తర్వాత స్వల్ప తేడాతో కోరంపై201 కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన హరిప్రియ విజయం సాధించింది . ఆ తరువాత టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 లో కోరం పై హరిప్రియ స్వల్ప తేడాతో విజయం సాధించింది అనంతరం    నియోజవర్గంలో రెండు వ్యతిరేక కార్యకలాపం నిర్వహిస్తున్నారు గ్రూపులు ఏర్పడ్డాయి .ఈ నేపథ్యంలో హరిప్రియ వర్గంలోనే కొంతమంది కీలక నాయకులు హరిప్రియకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగంగా ఓడిస్తామని, టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టాన్నికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచిస్తుందని హరిప్రియ వ్యతిరేక వర్గీయులు భావించారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు నీ  కలిసి టిక్కెట్ ఇవ్వొద్దని చెప్పిన దాఖలాలు ఉన్నాయి .టికెట్ ఇస్తే సహకరించమని చెప్పగానే చెప్పారు .అయితే అధిష్టానం హరిప్రియ కి మొగ్గు చూపింది. లాజిక్ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తాం అభ్యర్థులను వ్యతిరేకతుంటే పరిశీలిస్తామని కెసిఆర్ ప్రకటించారు . అభ్యర్థులపై వ్యతిరేకత అభ్యర్థులపై వ్యతిరేకత ఉంటే త్రిష కమిటీ చూసుకుంటుందని ఆపై అభ్యర్థుల మార్పు చూసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: మట్టాదయానంద్ కు  బిగ్ షాక్

అదును కోసం వ్యతిరేకులు ఎదురు చూస్తున్నట్లుగా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇల్లందు పట్టణంలోని కీలకమైన నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఐదు మండలాలకు సంబంధించిన కొందరు ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు వ్యతిరేకతగా ఉన్నారు .రాబోయే రోజుల్లో ఓటమిక .లేదా గెలుపు కోసం .కృషి  చేస్తారో లేదో అనేది  వేచి చూడాలి .రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రత్యర్థికే సహకరిస్తారని మెజార్టీగా అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.