Telugu News

కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తో పంపిణి

పంపిణి చేసిన ఎమ్మెల్యే కందాళ, ఇన్ఫ్రా అధినేత

0

కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తో పంపిణి

 

** పంపిణి చేసిన ఎమ్మెల్యే కందాళ, ఇన్ఫ్రా అధినేత

(ఖమ్మంరూరల్-విజయం న్యూస్);-
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డు లోని శ్రీరాం నగర్ దర్గా వద్ద కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో రంజాన్ కా తోఫా (రేషన్ కిట్) పంపిణి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్యతిధిగా హాజరై కిట్స్ ను ముస్లీం నిరుపేదలకు పంపిణి చేశారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సఏవలందిస్తున్న కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ వారికి అభినంధనలు తెలిపారు. ముందుముందు రోజుల్ల మరన్ని సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజాదీవేనలను అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ అధినేత ఖలీల్, ఖమ్మం ఎంపీపీ బెల్లం ఉమా, కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు