ఖమ్మం నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి
== హాజరైన మేయర్ నీరజ,మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు రవికిరణ్
ఖమ్మం నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి
== హాజరైన మేయర్ నీరజ,మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు రవికిరణ్
(ఖమ్మం-విజయంన్యూస్);-
రంజాన్ మాసం పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా, పువ్వాడ ఫౌండేషన్ సమకూర్చిన సేమియా కిట్స్ ను నగరంలోని కాల్వఒడ్డు మోతి మసీద్ నందు పేద ముస్లింలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు పంపిణి కార్యక్రమాన్ని నగర మేయర్ పునుకొల్లు నీరజ ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్ పేద ప్రజలకు తోఫా ను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
also read :-పినపాకలో కారు పోరు
మన మంత్రివర్యులు మసీదుల మరమ్మత్తులు కొరకు
నగరంలోని 50 మాసిద్ లకు గాను రూ.50 లక్షల విలువైన చెక్కును అందించడం జరిగిందన్నారు. మన మంత్రివర్యులు కులాలకు మతాలకు అతీతంగా పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు. అదేవిధంగా వారి వ్యక్తిగతంగా ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా రంజాన్ సేమియా ప్యాకెట్ కిట్టులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు బోజెడ్ల రామ్మోహన్, టౌన్ ప్రచార కార్యదర్శి షకీన, కేశగాని రవి, దరిపల్లి శ్రీనివాస్, తాజుద్దీన్, షంషుద్దీన్, జానీ, చరణ్ తదితరులు ఉన్నారు..