Telugu News

ఘనంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ

ఆళ్లపల్లి  విజయం న్యూస్

0

ఘనంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ

(ఆళ్లపల్లి  విజయం న్యూస్);-

మండల పరిధిలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ పరమ ప్రభాకర్ ప్రోత్సాహంతో సివిల్ విద్యార్థి గుండాల మండలాని చెందిన పాయంసుధాకర్ సహకారంతో 12 గ్రామపంచాయతీలకు చెందిన 38 మంది కార్మికులకు తాసిల్దార్ మహమ్మద్ సాదియా సుల్తానా అధ్యక్షతన ఎంపీపీ మంజు భార్గవి ఎంపీడీవో మంగమ్మ,ఎంపీవో కవిరాజు,వైస్ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ కోటేష్,వ్యాపార వర్గాల అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీనివాసరావు,నరెడ్ల వెంకన్నల చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప యూనిఫామ్ వితరణ కార్యక్రమం జరిగింది.

also read;-మేడే కార్మికులు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం

ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ సహకారంతో ఆంధ్రప్రభ రిపోర్టర్ ప్రభాకర్ ప్రోత్సాహంతో 38 మందికి యూనిఫామ్ వితరణలో పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి గుండాల అల్లపల్లి మండలాల్లో గత ఏడాది నుండి అనేక మందికి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి విద్యార్థులకు విద్య కు సంబంధించిన పుస్తకముల కొరకు కొంత నగదు బహుమతులను సైతం అందించడం జరిగింద న్నారు.అదేక్రమంలో ఆళ్లపల్లి మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు స్పందించిన ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ పరమ ప్రభాకర్ మాట్లాడుతూ గత 2004లో పాఠశాల విద్యా వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పదవ తరగతి విద్యార్థులకు అభినందన సభను తన సొంత ఖర్చులతో దారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని,అలాగే 2004 నుండి 2008 వరకు సాంఘిక సేవా సంస్థ ద్వారా అనంతోగూ,తిరేలాపురం,ఆళ్లపల్లి, మైలారం పలు గిరిజన గ్రామాలలో డ్వాక్రా సంఘాలను నూతనంగా ఏర్పాటు చేసి వారికి డిఎస్ఎస్ కె సంస్థ ద్వారా గ్రూపుకు 20 వేల రూపాయలు ఉచితంగా మంజూరు చేయించడం జరిగిందన్నారు.

also read;-ఖమ్మం సర్కార్ దవఖానలో టెన్షన్..టెన్ష

న్అదేక్రమంలో 2008- 2009 సంవత్సరంలో బీడీ ఆకులకు కల్లెదారిగా విధులు నిర్వహించి దానికి వచ్చిన 30 వేల రూపాయలు కమిషన్తో ఆళ్లపల్లి మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చి నిర్మాణానికి వితరణ అందించడంతో కాలనీవాసులు,పలువురు ప్రభాకర్ సేవలను అభినందించారు.మండలంలోని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రభాకర్ అభినందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు అధికారులు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో కవిరాజు కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రవీణ్ నాగరాజు కార్మిక సంఘం అధ్యక్షులు ప్రభుదాస్ కారోబార్ శేఖర్ వార్డు సభ్యులు మొహమ్మద్ ఖయ్యుం,సురేష్,సతీష్ కార్మిక సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు