Telugu News

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

ప్రజల వైద్యశాలగా పరిఢవిల్లాలి.

0

ప్రజల వైద్యశాలగా పరిఢవిల్లాలి.

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

ఘనంగా ప్రారంభమైన శ్రేష్ఠ హాస్పిటల్

(ఖమ్మంవిజయం న్యూస్):-

ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభమైన శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై , ప్రజల వైద్యశాలగా పరిఢవిల్లాలని టీఆర్ఎస్ లోకసభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు . ఖమ్మం నగరంలోని ఎన్.ఎస్.టి రోడ్లో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రేష్ఠ మల్టీ స్పెసాలిటీ హాస్పిటల్ ను శనివారం నాడు రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రారంభించారు .

also read :-సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఉత్సంగా వనదేవతల గద్దెలపైకి ఆహ్వానం .

ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ … ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు శ్రేష్ఠ హాస్పిటల్ ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు . వైద్య సేవల్లో భాగంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించి అందరి మన్ననలు అందుకోవాలని కోరారు .డా. సునీల్ కిలారి జిల్లాలో సుపరిచితులుగా ఉన్నారనీ , మొదటి , రెండో దశల్లో జిల్లాలో ప్రజలకు ఎన్నో రకాల వైద్య సేవలు అందించి ఏమాత్రం లాభాపేక్షలేకుండా ప్రజల ప్రాణాలు కాపాడారని డా . సునీల్ కుమార్ ని అభినందించారు . లాక్ డౌన్ కాలంలో రవాణా స్తంభించిపోయి , ప్రజలు హాస్పిటల్ కు రాలేని సమయంలో టెలీ మెడిసిన్ విధానంలో డా . సునీల్ కిలారి తాను ఫోన్ ద్వారా రోగులకు నిత్యం అందుబాటులో ఉండి వారికి కావాల్సిన వైద్య సేవలు అందించడాన్ని నామ నాగేశ్వరరావు కొనియాడారు . జనరల్ మెడిసిన్ తో పాటు , వివిధ విభాగాల్లో ప్రజలకు అవసరమైన అత్యుత్తమ సేవలు అందించాలని ఎంపీ నామ కోరారు .

also read :-భారతీయ ప్యాకేజింగ్‌ను విప్లవాత్మీకరించనున్న సీజ్‌వెర్క్‌

ప్రజారోగ్యాన్ని కాపాడంలో వైద్యులు శక్తి వంచనలేకుండా కృషిచేయాలని కోరారు . పేద , మధ్యతరగతి కుటుంబాలకు హైదరాబాద్ తరహా వైద్య సేవలను అందించడంలో ఆధునిక సాంకేతిక వైద్య పరికరాలు సమకూర్చుకుని మెరుగైన సేవలు అందించాలని సూచించారు . ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును హాస్పిటల్ యాజామాన్యం శాలువాతో ఘనంగా సత్కరించి మొమెంటోను అందజేశారు …ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.