*మాకు న్యాయం చేయండి : మంత్రి హారీష్ రావును కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు
** సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని మంత్రి హరిష్ రావుకీ వినతి.
***మాకు న్యాయం చేయండి : మంత్రి హారీష్ రావును కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు
*** సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని మంత్రి హరిష్ రావుకీ వినతి.
***(తిరుమలాయపాలెం, కూసుమంచి-విజయంన్యూస్):-
సీతారామ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని, సరైన ధరను కల్పించి నిరుపేద రైతులను కాపాడాలని పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు చెందిన భూనిర్వాసితులు మంత్రి హారీష్ రావును కలిసి వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాలేరు నియోజకవర్గ ప్రజలకు మంచినీటి,వ్యవసాయ వనరులకు నీటీ సదుపాయం కల్పించడం కొరకు రూపొందించిన సీతారామ ప్రాజెక్టు కింద భూమిని ప్రభుత్వానికి దానం చేసిన రైతులకు భూమి ఖరీదు అనూకులంగా నష్టపరిహారం ఇవ్వాలని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామప్రాజెక్టు భూ నిర్వాసితులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావుని కలిసి వినతి పత్రానిన అందించారు.
also read :-***నేనున్నానని మీకేంకాదని : మాజీ ఎంపీ పొంగులేటి
నియోజకవర్గ ప్రజల పలు సమస్యలు వివరించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కొరకు తిరుమలయాపాలెం, కూసుమంచి మండల పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదని,సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారాని రైతులకు అందించాలని కోరారు.
మండల ప్రాథమ ఆరోగ్య కేంద్రం 24గంటలు సౌకర్యం కల్పించాలని,డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. తిరుమలాయపాలెం మండల సమస్యల గురించి ఎంపిపి బోడ మంగీలాల్ మాట్లాడుతూ మండలంలోనీ వైద్యకేంద్రాలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సహకరించాలని దాని కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని, మండల పరిధిలోని వైద్య ,విద్యా రంగాల్లో సౌకర్యాల పునరుద్ధరణ కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, బోడా మంగిలాల్, ఆత్మకమిటీ చైర్మన్ రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, పొలంపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.