Telugu News

ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే బాల్క సుమన్

0

ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే బాల్క సుమన్

( నస్పూర్ – విజయం న్యూస్ )
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టిబిజికేఎస్ దేనని ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఓ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన టీబీజీకేఎస్ సాధారణ సమావేశంలో ఆయనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

also read :-పండగ పూట రెండు గ్రామల మద్య ఘర్షణ..

కోల్ ఇండియాలో లేని హక్కులను సింగరేణిలో సాధించామని తెలిపారు.పదివేలకు పైగా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని, కార్మికుల తో పాటు తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా లాభాల్లో కార్మికుల వాటా 29 శాతానికి పెంచిన ఘనత టీబీజీకేఎస్ కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రైవేటీకరిస్తే ఉద్యమాలు చేపడతామని అన్నారు. అలాగే మారు పేర్లను,కారుణ్య నియమాకాలలో అభ్యర్థుల వయోపరిమితి పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మిగతా యూనియన్ల నాయకులు టీబీజీకేఎస్ నాయకుల్ని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కార్మికులకు చేసిందేమీ లేదని అన్నారు.

also read :-కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం

గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని టీబీజీకేఎస్ నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అన్నయ్య,మల్లారెడ్డి,వీరభద్రయ్య, నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు విజిత్ రావు, పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.