Telugu News

ప్రతి గింజను కొనుగోలు చేయాలి

పండుగ తరహాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

0

ప్రతి గింజను కొనుగోలు చేయాలి

== పండుగ తరహాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

== ధాన్యం కొనుగోలుపై జిల్లా ఉన్నతాధకారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ..

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలో రైతులు సాగు చేసిన యాసంగి వరి పంటను ప్రతి గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలుపై ముఖ్య మంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు టీటీడీసీ భవనంలో జిల్లా కలెక్టర్ వీపి గౌతం అధ్వర్యంలో సంభందిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధాన్యం కొనుగోలు పై పలు సూచనలు చేశారు.

also read :-బార్ ,రెస్టారెంట్‌లో క్రికెట్ బెట్టింగ్‌
ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన ప్రతి గింజను సేకరించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై అనుసరించాల్సిన విధానం, కొనుగోలు కేంద్రాలు, రవాణా సౌకర్యం, బ్యాంకుల ద్వారా రైతులకు నగదు బదిలీ, గన్ని బ్యాగ్స్, తూనికలు, వేసవి తాపాన్ని తట్టుకునేలా రైతులకు టెంటు, త్రాగునీరు తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ స్నేహాలత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు..