*ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా: మంత్రి.. పువ్వాడ.
*రూ.2లక్షల భీమా చెక్కును మృతుడి భార్యకు అందజేసిన మంత్రి పువ్వాడ.
*ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా: మంత్రి.. పువ్వాడ.
*రూ.2లక్షల భీమా చెక్కును మృతుడి భార్యకు అందజేసిన మంత్రి పువ్వాడ.
*(ఖమ్మంవిజయం న్యూస్):-
పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న ప్రతి కార్యకర్తలను తెరాస పార్టీ గుర్తిస్తుందని, వారికి అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త పెనుగూరు వేంకటేశ్వర్లు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
పార్టీ సభ్యత్వం కలిగిన వేంకటేశ్వర్లు కుటుంబానికి మేలు జరగాలని భావించిన మండల నాయకులు ఈ విషయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన మంత్రి పువ్వాడ రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వారికి రూ. 2 లక్షల ప్రమాద భీమాని మంజూరుచేయించారు.ఆయా చెక్కును రఘునాథపాలెం రైతు వేదిక నందు మృతుని భార్య విమలకు మంత్రి పువ్వాడ అందజేశారు.
also read ;-*రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.,……
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు తెరాస పార్టీ ప్రమాద భీమా కల్పించిందని తద్వారా భీమా క్రింద రూ.2 లక్షలు వారి కుటుంబానికి అందించడం పార్టీ అధ్యక్షుడు కేసీఅర్ గారి ముందు చూపుకు నిదర్శనమన్నారు.పార్టీ కోసం పని చేస్తున్న ప్రతిఒక్కరిని ఆదుకుంటామని, ప్రభుత్వం తరుపున వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు.
వివిధ పనుల్లో బిజీ గా ఉంటు అనుకోని రీతిలో ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ప్రమాద భీమా ఇవ్వాలనే దృడ సంకల్పంతో పార్టీ అధ్యక్షులు కేసీఅర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.కార్యక్రమంలో జడ్పిటిసి ప్రియాంక, ఎంపిపి గౌరీ, ఆత్మ చైర్మెన్ భూక్యా లక్ష్మణ్ నాయక్, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్ తదితరులు ఉన్నారు