Telugu News

ఖమ్మంలో ఉత్కంఠ విమర్శలు.. ప్రతి విమర్శలు

విమర్శలు.. ప్రతి విమర్శలు

0

ఖమ్మంలో ఉత్కంఠ విమర్శలు.. ప్రతి విమర్శలు
== రెండువ రోజు బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై కొనసాగిన ఆందోళనలు
== నల్లబ్యాడ్జీలతో బీజేపీ నేతల నిరసన
== త్రీటౌన్ లో ఫిర్యాదు చేసిన సాయిగణేష్ అమ్మ
== దాడులు చేసిన బీజేపీ నేతలపై, బీజేపీ నేతను దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తపై కేసు నమోదు
== మంత్రి పువ్వాడపై బీజేపీ, కాంగ్రెస్ నేతల పైర్
== పువ్వాడ అజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
== పోలీసులు చెంచాగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్
== బీజేపీ ,కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన టీఆర్ఎస్
== మంత్రి నివాసం, మంత్రి క్యాంఫ్ ఆపీస్ వద్ద పోలీస్ బందోబస్తు
== వాయిదా పడిన మంత్రి కేటీఆర్ పర్యటన

(ఖమ్మం  -విజయం న్యూస్);-

ఖమ్మం నగరంలో ఉద్రిక్తత వాతావరణం నేలకొని ఉంది.. బీజేపీ నాయకుడు సాయిగణేష్ చౌదరి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామంలో భాగంగా బీజేపీ నాయకులు రెండవ రోజు కూడా నిరసన చేపట్టారు. మంత్రిపై పైర్ అయ్యారు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. విమర్శలు..ప్రతివిమ్మర్శలు చేసుకుంటున్నారు.. కాగా ఖమ్మం ఘటనపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.. మంత్రిని బర్తరప్ చేయాలని జగ్గారెడ్డి అంటే, టీఆర్ఎస్ పార్టీకి మూడిందంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే పరిస్థితులు చక్కబెట్టేందుకు పోలీసులు ఖమ్మం నగరంలో అప్రమత్తంగా ఉన్నారు.. మంత్రి నివాసానికి, క్యాంఫ్ కార్యాలయం, టీఆర్ఎస్ భవనం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా నేడు జరిగే మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

also read :-మేడారం లో వాహనాల తనిఖీ

ఖమ్మంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ నాయకుడు, మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సామినేని సాయిగణేష్ చౌదరి గత మూడు రోజుల క్రితం ఆత్మహత్యం చేసుకోగా, ఆయన శనివారం చనిపోయాడు. దీంతో బీజేపీ నాయకులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి దాడి చేయడం, మంత్రి ప్లెక్సిలను దగ్ధం చేయడం, ఈ సంఘటన చూసిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం ఫలితంగా ఖమ్మం నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెండవ రోజు ఆదివారం కూడా ఖమ్మం నగరంలో ఉత్కంఠ నేలకొందనే చెప్పాలి. హానుమాన్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని చర్చికంపౌడ్ ఏరియాలో బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించే క్రమంలో హనుమాన్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నేలకొంది..దీంతో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అయితే ఖమ్మం నగరంలో పరిస్థితులను భట్టి పోలీసులు అప్రమత్తమైయ్యారు. మంత్రి నివాసంతో పాటు క్యాంఫ్ కార్యాలయం, పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
== త్రీటౌన్ లో ఫిర్యాదు చేసిన సాయి అమ్మ, బీజేపీ నాయకులు
బీజేపీ నాయకుడు సాయిగణేష్ చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్పోరేటర్ భర్త కన్నం ప్రసన్నకుమార్ ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని, ఫలితంగా సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణమైన మంత్రి, కార్పోరేటర్ భర్త, పోలీసులపై కేసులు నమోదు చేయాలని సాయి అమ్మ సామినేని సావిత్రి, బీజేపీ జిల్లా నాయకులు ఖమ్మం త్రీటౌన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీదర్ రెడ్డి, బీజీపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో గత మూడు రోజుల క్రితం జరిగిన సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న టైంలో పోలీసులు సాయి గణేష్ ను గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలి వెళ్లారు,

also read :-108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

also read;-320 కే జి లా గంజాయి పట్టివేత…

ఏసీపీ చెప్పినట్లు ఆరోగ్య హాస్పిటల్ కి తీసుకెళ్ళాము, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్ళామని తెలిపారు. ఖమ్మంలో పోస్టు మార్టం నిమ్మిత్తం సాయంత్రం వరకు నిర్లక్ష్యం వహించారని, టీఆర్ఎస్ పార్టీ అల్లరిముక్కలు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చి ఆందోళనకు కారణమైయ్యారని ఆరోపించారు. పోలీస్ శాఖ టీఆరెఎస్ పార్టీ అల్లరిముకలకి కొమ్ము కాస్తున్నారని, టీఆరెఎస్ నాయకులు మాత్రం అంతిమ యాత్ర సమయంలో కర్రలు, రాడ్లు పట్టుకొని దాడి చెయ్యాలని చూశారని ఆరోపించారు. పోలీసులు మరణం వాగ్మూలం ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు.

అంతిమయాత్ర చివరిలో నివాళులు అర్పించడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ నగర అధ్యక్షులు అంతిమ యాత్రలో కర్రలు పట్టుకొని వచ్చారని, ఈ ఘటనకు బాధ్యతగా పువ్వాడ అజయ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ అంత టీఆరెఎస్ పార్టీ గుప్పెట్లో ఉందని, భారతీయ జనతా పార్టీ ఈ విషయంపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
== మంత్రి అజయ్ కుట్రలో భాగంగానే జరిగిన ప్రభుత్వ హత్య : బండి సంజయ్
బీజేపీ నాయకుడు సాయి గణేష్ చనిపోవడం పట్ల బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జోగులాంబజిల్లా పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కండకావరం కారణంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పై 16 అక్రమ కేసులు బనాయించారని బండి సంజయ్ ఆరోపించారు.

పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు వేధించడంతో సాయి నగేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బండి సంజయ్ పేర్కొన్నారు. స్థానిక మంత్రి అక్రమాలు, ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించడమే ఆ యువకుడు చేసిన పాపం అని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ మంత్రి అజయ్ కుట్రలో భాగంగా జరిగిన ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఆయనను వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.