Telugu News

చంద్రబాబువి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్లనాని

జంగారెడ్డి గూడెం మరణలపై అసత్య ప్రచారం

0

చంద్రబాబువి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్లనాని
== జంగారెడ్డి గూడెం మరణలపై అసత్య ప్రచారం
== అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి ఆళ్లనాని
(అమరావతి-విజయంన్యూస్)
టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆళ్లనాని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశంలో నిర్వహిస్తున్న ఆందోళనపై ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న మరణాలపై అధికారు లతో కలిసి వెళ్లి పరిశీలించానని తెలిపారు. నల్గురు చనిపోతే 18 మంది చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో జరుగుతున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాతోనే జంగారెడ్డి గూడెంలో మరణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

also read;-సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం: సీఎం జగన్

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరంగా బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. నాటు సారా, కల్తీసారా తాగడం వల్లే చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వచ్చిన వెంటనే అక్కడ మెడికల్‌ క్యాంపులు పెట్టమని సీఎం చెప్పారని అసెంబ్లీ డిప్యూటీ సీఎం, ఆళ్ల నాని పేర్కొన్నారు. అక్కడ సర్వే కూడా నిర్వహిస్తున్నమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బలప్రదర్శనకు వెళ్ళారా లేదంటే పలకరింపునకు వెళ్లారన్నారు. అక్కడి సాధారణ మరణాలను టీడీపీ కల్తీ మద్యం మరణాలుగా చిత్రీకరిస్తోందని ఆళ్ల నాని పేర్కొన్నారు. అయితే టిడిపికి చెందిన వారే కల్లీ సృష్టించి ఇలా చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. అంతకుముందు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు సభకు రాకుండా రెచ్చగొట్టేలా చేస్తున్నారని మండిపడ్డారు. మండలిలో లోకేశ్‌ కూడా ఇదే విధంగా రెచ్చగొట్టేలా చేస్తున్నారని మండిపడ్డారు.

also read;-ఓటమికి సోనియా ఒక్కరినే బాధ్యులను చేయలేం

వీరి ఆటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మద్యాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా ప్రోత్సహించారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆరోపించారు. బాగా అమ్మించిన అధికారులకు ప్రమోషన్‌లు ఇచ్చారన్నారు. ఇద్దరు పచ్చి తాగుబోతులు చనిపోతే దాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని ఉదయభాను విమర్శించారు. గుడి దగ్గర, బడిదగ్గర, మెయిన్‌ రోడ్‌ పైన మద్యం షాప్‌లను ప్రోత్సహించారన్నారు. జంగారెడ్డి గూడెం వెళ్లాలని ఇక్కడ సభలో గొడవ చేశారన్నారు. బీసీ స్పీకర్‌పై పేపర్‌లు చింపి విసిరేయడం ఆయన్ను అవమానించడమేనని సామినేని ఉదయభాను పేర్కొన్నారు.